ఈటీవీలో వచ్చే బిగ్గెస్ట్ రియాలిటీ డ్యాన్స్ షో ‘ఢీ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్ధానికి పైగా డాన్స్ షో లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్న ఢీ ప్రస్తుతం 13వ సీజన్ ‘కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ కొనసాగుతుంది. అయితే తాజాగా వచ్చే వారం ఎపిసోడ్‌కి సంబంధించి ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వీక్ విలేజ్ థీమ్ స్పెషల్ అంటూ సరికొత్తగా ప్రేక్షకులను అలరించబోతుంది.
అయితే ఈ షోకు వచ్చిన జడ్జీలు, టీం లీడర్స్, కంటెస్టెంట్లు అందరూ పల్లెటూరి కట్టుతో సాంప్రదాయంగా కనిపించారు. కంటెస్టెంట్లు చేసిన సాంగ్స్ కూడా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌నే ఎంచుకుని చేయడం చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఎప్పటిలాగానే సుధీర్, ఆదిలు తమ డైలాగ్స్‌తో నవ్వులు పూయించారు. ఇక చివరలో చాతల్ బ్యాండ్‌కు అందరూ తీన్మార్ స్టెప్పులతో స్టేజ్‌ని దద్దరిల్లించారు. మరీ ఈ ఫుల్ విలేజ్ థీమ్ ఎంటర్టైన్మెంట్ను మిస్ కాకూడదంటే ఆగష్టు 25 బుధవారం ఈటీవీలో వచ్చే ఢీ 13ను తప్పక చూడాల్సిందే. ఇక అప్పటి వరకు ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.
ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


