కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణం గా ఓటిటి క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆహా వీడియో సరికొత్త చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో, కార్యక్రమాల తో దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆహా మినీ స్ సైతం యూ ట్యూబ్ ద్వారా వెబ్ సిరీస్ లను కార్యక్రమాలను చేపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే యూ ఆవకాయ మీ ఐస్ క్రీం తో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎపిసొడ్ 2 కి సైతం ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది.
ఆహా మినీ స్ లో ఉన్నటువంటి ఎపిసొడ్2 ప్రస్తుతం 500కే వ్యూస్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ చేసిన రెండు రోజుల్లోనే 500కే వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. ఈ కార్యక్రమం కి భార్గవ్ దాసరి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్డి చడా కథ అందిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ గా వస్తున్న ఇందులో శీతల్ గౌతమన్, ఉద్భవ్ రఘునందన్, నాగబాబు కొణిదెల, రమేష్, సుబ్బరాయ శర్మ, స్నిగ్ధ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


