యూత్ స్టార్ నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “మాస్ట్రో”. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “అంధధూన్’కి రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో నటించింది. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ సినిమా సెప్టెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. “హార్ట్ ఏమో కొట్టుకుంది గోడకి.. వేలాడుతున్న గడియారంలా” అంటూ సాగే ఈ పాటను కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, ధనుంజయ్ సీపాన ఆలపించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఇదిలా ఉంటే శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి