హిందీలో బాగా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రామ్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్‌కు హీరో విజయ్ సేతుపతి, కన్నడలో కిచ్చ సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, తెలుగుకు తమన్నా హోస్ట్‌గా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం తెలుగులో మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రావడం లేదు.
దీంతో ఈ షోలో చిన్న మార్పు తీసుకురావాలని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారట. ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమన్నా స్థానంలో యాంకర్ అనసూయను తీసుకోబోతున్నారట. అయితే షో రేటింగ్ డల్‌గా ఉన్న కారణంగానే ఈ మార్పు చేస్తున్నారని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.