3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న భం అఖండ సాంగ్ ప్రోమో!

3 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న భం అఖండ సాంగ్ ప్రోమో!

Published on Nov 6, 2021 3:03 AM IST

akhanda 3
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఈ చిత్రం నుండి భం అఖండ సాంగ్ ప్రోమో ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది.

ఈ భం అఖండ సాంగ్ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అంతేకాక ఈ వీడియో ఇప్పటి వరకూ సోషల్ మీడియా లో 3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ నటిస్తుండగా, ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఈ చిత్రం లో కీలక పాత్ర లో నటిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

ప్రోమో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు