స్మాల్ స్క్రీన్ పై కూడా “సీతా రామం” సత్తా చాటుతుందా?

స్మాల్ స్క్రీన్ పై కూడా “సీతా రామం” సత్తా చాటుతుందా?

Published on Nov 11, 2022 3:00 PM IST

ఈ ఏడాది టాలీవుడ్ లో వచ్చిన హిట్స్ లోనే కాకుండా టాలీవుడ్ నుంచే ఓ క్లాసిక్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో డెఫినెట్ గా “సీతా రామం” నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా యంగ్ జంట దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ లు నటించారు.

మరి వీరి కలయికలో వచ్చిన ఈ అద్భుత దృశ్యకావ్యం టాలీవుడ్ లో ఓ సెన్సేషనల్ హిట్ కాగా ఇప్పుడు ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ పై అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఇక ఈ చిత్రం శాటిలైట్ హక్కులని స్టార్ మా వారు సొంతం చేసుకోగా ఈ చిత్రం అందులో ఈ నవంబర్ 20న సాయంత్రం 6 గంటలకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కావడానికి సిద్ధం అయ్యింది. మరి స్మాల్ స్క్రీన్ పై కూడా ఈ చిత్రం డెఫినెట్ గా మంచి రేటింగ్ రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి సీతా రామం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు