ఆకట్టుకుంటున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ‘వాసవ సుహాస’ సాంగ్

ఆకట్టుకుంటున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ‘వాసవ సుహాస’ సాంగ్

Published on Dec 24, 2022 6:19 PM IST

ప్రస్తుతం హీరోగా ఒక్కో సినిమాతో ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ ని అందుకుంటూ కొనసాగుతున్న యువ నటుడు కిరణ్ సబ్బవరం నటిస్తున్న తాజా సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. యువ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్ గా నటిస్తోంది. తిరుమల తిరుపతి నేపధ్యంలో రూపొందుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ అందరినీ ఆకట్టుకోగా నేడు ఈ మూవీ నుండి వాసవ సుహాస అనే పల్లవితో సాగె అద్భుతమైన మెలోడియస్ సాంగ్ ని కొద్దిసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది యూనిట్.

కాగా నిన్న ఈ సాంగ్ ప్రోమో ని కళాతపస్వి కె విశ్వనాధ్ విడుదల చేసి వీక్షించిన అనంతరం యూనిట్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలియచేసారు. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ అద్భుతమైన మెలోడియస్ ట్యూన్ అందించిన ఈ సాంగ్ కి కళ్యాణ్ చక్రవర్తి ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించగా యువ గాయకుడు కారుణ్య సాంగ్ ని అత్యద్బుతంగా పాడారు. ప్రస్తుతం వాసవ సుహాస సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతోంది. కాగా వినరో భాగ్యము విష్ణు కథ మూవీని 2023 ఫిబ్రవరి 17న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు