ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కమల్ – మణిరత్నం చిత్రం!

ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కమల్ – మణిరత్నం చిత్రం!

Published on Nov 6, 2023 11:13 PM IST

Thug Life

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి థగ్ లైఫ్ టైటిల్ ను ఖరారు చేసారు మేకర్స్. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయడం జరిగింది. కమల్ హాసన్ ను మునుపెన్నడూ చూడని గెటప్ లో మణిరత్నం ప్రెజెంట్ చేశారు. ఈ వీడియో ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది.

ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ. ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో జయం రవి, దుల్కర్ సల్మాన్, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్, మద్రాస్ టాకీస్, రైడ్ గియాంట్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు