అదరగొడుతున్న ‘పెద్ది గ్లింప్స్‌’.. చరణ్ మాస్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా !

అదరగొడుతున్న ‘పెద్ది గ్లింప్స్‌’.. చరణ్ మాస్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా !

Published on Apr 6, 2025 12:02 PM IST

Untitled 5 1

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని టీమ్‌ తాజాగా ‘పెద్ది గ్లింప్స్‌’ రిలీజ్ చేసింది. సినిమాలో రామ్‌చరణ్‌ పాత్ర ఏవిధంగా ఉండనుందో ఈవీడియోలో చూపించారు. మొత్తానికి మాస్‌ అవతార్‌లో చరణ్‌ లుక్‌ అదిరిపోయింది. అలాగే చరణ్ చెప్పిన డైలాగ్‌లు కూడా ఈలలు వేయించేలా ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్‌ చివర్లో చరణ్‌ కొట్టిన సిక్స్‌ షాట్‌ మాత్రం వావ్‌ అనిపించేలా ఉంది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రగడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. అన్నట్టు గ్రామీణ నేపథ్యంలో క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఇది విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు