యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’ రేపు(జూన్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు మణిరత్నం డైరెక్ట్ చేయడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
అయితే, ఈ సినిమాను కమల్ హాసన్‌తో పాటు మణిరత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. కాగా, ఈ చిత్రం రిలీజ్‌కు ముందే మంచి లాభాలను తెచ్చిపెడుతున్నట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. థగ్ లైఫ్ చిత్ర ఓటీటీ రైట్స్ రూపంలో రూ.130 కోట్లు రాగా, శాటిలైట్ రైట్స్ రూ.60 కోట్లు.. మ్యూజిక్ రైట్స్‌కు రూ.20 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక థియేట్రికల్ రిలీజ్‌తో వచ్చేది మొత్తం లాభాలే కానున్నాయి.
ఇలా థగ్ లైఫ్ సినిమా రిలీజ్‌కు ముందే మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో శింబు, త్రిష, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


