సైలెంట్ గా జపాన్లో రిలీజైన ‘విక్రమ్’.. లిమిటెడ్ గానే సాలిడ్ వసూళ్లు!

సైలెంట్ గా జపాన్లో రిలీజైన ‘విక్రమ్’.. లిమిటెడ్ గానే సాలిడ్ వసూళ్లు!

Published on Jun 5, 2025 4:00 PM IST

vikram

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రాల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “విక్రమ్” కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ దర్శకు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్స్ లో మూడేళ్ళ కితం ఆడియెన్స్ కి మెంటల్ మాస్ ట్రీట్ ని అందించి భారీ వసూళ్లు కొల్లగొట్టింది.

అయితే జస్ట్ రెండు రోజులు కితమే ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకోగా దీనికి కొన్ని రోజులు ముందే అంటే మే 30న జపాన్ దేశంలో ఈ చిత్రం సైలెంట్ గా విడుదల అయ్యింది. ఇది దాదాపు చాలా మందికి కూడా తెలీదు. చాలా లిమిటెడ్ గా కేవలం 55 స్క్రీన్స్ లోపే విడుదల అయ్యినట్టుగా తెలుస్తుంది.

అయితే ఇంత తక్కువ స్క్రీన్స్ లో అయినప్పటికీ ఈ కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం 8.4 మిలియన్ జపాన్ యెన్స్ ని వసూలు చేసిందట. అంటే సుమారు 50 లక్షలకి పైగా వసూళ్లు అందుకుందట. దీనితో విక్రమ్ చిత్రానికి అక్కడ సాలిడ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా విజయ్ సేతుపతి, సూర్య, ఫహద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో కనిపించారు.

తాజా వార్తలు