ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ తాలూకా మొదటి సాంగ్ సూపర్ హిట్ అయ్యి మంచి రెస్పాన్స్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత పవన్ లుక్ పూర్తిగా మార్చేయడం జరిగింది. చాలా దగ్గరకి హెయిర్ కట్ చేయించేసి గడ్డం మాత్రం పెంచుతూ వెళుతున్నారు.
కొన్ని రోజులుగా ఇదే కనిపిస్తుంది కానీ ఇప్పటికీ ఇదే లుక్ ని మైంటైన్ చేస్తూ రావడం ఆఫ్ లైన్ లో కూడా సివిల్ కాస్ట్యూమ్ లోనే కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ మాత్రం ఈ కొత్త లుక్ లో చూసి కొంచెం ఎబ్బెట్టుగానే ఫీలవుతున్నారని చెప్పాలి. సోషల్ మీడియాలో చాలా వరకు ఇదే కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి.
ఇది ఏదన్నా సినిమా కోసమా లేక మామూలుగానే ప్లాన్ చేసుకుందా ఏమో కానీ ఫ్యాన్స్ నుంచి మాత్రం అంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అయితే దీనికి రావడం లేదు. సో దీనితో పవన్ కొంచెం స్లిమ్ అయ్యి మరోలా ఏమన్నా మారే ప్రయత్నం చేస్తారా లేదా అనుకున్నట్టుగానే సినిమా కోసం చేస్తున్న కొత్త లుక్ ఇదేనా అనేది వేచి చూడక తప్పదు.


