విడుదల తేదీ : జనవరి 01, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : ఎస్ ఎస్ దుశ్యంత్, ఆషిక రంగనాథ్, కిషన్ బిళగలి, సుధా బెల్వాడి, కార్తీక్ రావు
దర్శకుడు : సింపుల్ సుని
నిర్మాతలు : సుని సినిమాస్, సెర్వెగ్ర సిల్వర్ స్క్రీన్స్
సంగీత దర్శకుడు : జుదా శాండీ
సినిమాటోగ్రాఫర్ : విలియం డేవిడ్
ఎడిటర్ : ఆషిక్ కుసుగోలి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
Gatha Vaibhavam Story కథ:
తాను గీసిన చిత్రంలో ఉండే వ్యక్తి కోసం ఆధునిక (ఆషిక రంగనాథ్ వెతుకుతూ ఉంటుంది. కానీ ఒక వి ఎస్ ఎక్స్ కంపెనీ ఓనర్ పురాతన్ (ఎస్ ఎస్ దుశ్యంత్) మాత్రం ఆమె గీసిన చిత్రంలో వ్యక్తి లానే ఉన్నాడని తెలుసుకుంటుంది. అలా అతని కోసం జరిపిన వేటలో పురాతన్ కి ఆధునిక ఏం చెప్పదలచుకుంది? అసలు ఇద్దరికీ మధ్య ఉన్న లింక్ ఏంటి? పురాతన్, ఆధునికని నమ్ముతాడా లేదా? వీరి కలయిక తర్వాత పరిస్థితులు ఎలా మారాయి అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
పునర్జన్మల నేపథ్యంలో మన దక్షిణాది నుంచే పలు సినిమాలు ఇది వరకు వచ్చాయి. అయితే అలాంటి వాటిలో ఈ చిత్రం కూడా ఒక నీట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎమోషనల్ పార్ట్ ఇందులో బాగానే క్యారీ అయ్యింది.
అలాగే తమ పాత్రల్లో ఇద్దరు లీడ్ నటీనటులు బాగా చేశారు. ధనుష్ అనేకుడు సినిమాలో హీరో హీరోయిన్స్ పలు వేరియేషన్స్ లో కనిపిస్తారు. అలానే ఇక్కడ కూడా ఆషిక ఇంకా దుశ్యంత్ లు డిఫరెంట్ పరిస్థితుల్లో అందుకు తగ్గ పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆషిక మంచి లుక్స్ అండ్ గ్లామర్ అలానే నటనతో కూడా ఆకట్టుకోగా తనకిది మొదటి సినిమా అయినప్పటికీ దుశ్యంత్ కూడా చాలా బాగా చేసాడు. అలాగే వీరి ఇద్దరిపై పీరియాడిక్ టైం పోర్షన్స్ బాగా వచ్చాయి.
ఇంకా సినిమాలో సెకండాఫ్ బెటర్ ఫీల్స్ అందిస్తుంది. కొన్ని సీన్స్ ఊహాజనితంగానే అనిపించినా ఎమోషన్స్, సంగీతం అలాగే ఇంకొన్ని సన్నివేశాలు బాగా పర్వాలేదు అనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రంలో కొన్ని చోట్ల ఎమోషన్ బాగానే ఉన్నప్పటికీ ఇలాంటి ఫాంటసీ పునర్జన్మల నేపథ్య సినిమాలకి ఆ డోస్ సరిపోదు. ముఖ్యంగా ఆ ఎమోషన్ ని ఆద్యంతం క్యారీ చేస్తేనే దాని తాలూకా విలువ మరింత పెరుగుతుంది. కానీ ఈ ఎలిమెంట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. అలాగే సన్నివేశాలు కొన్ని కావాలని ఇరికిస్తున్న ఫీల్ కలుగుతుంది.
అంతే కాకుండా సెకండాఫ్ బాగానే ఉన్నప్పటికీ అది కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కనిపించదు. అలాగే ఒక ఎమోషనల్ మూమెంట్ తర్వాత కథనం మళ్ళీ రొటీన్ గా మారిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా సింపుల్ గా ముగించేసినట్టు అనిపించింది. దీనిని ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకొని ఉంటే బాగుండేది.
అలాగే కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ తో కూడుకున్న సీన్స్ అంత సహజంగా ఏమి కనిపించవు. అంతే కాకుండా కొన్ని చోట్ల జరిగే సీన్స్ కి వినిపించే సంగీతానికి పొంతన లేకుండా కనిపిస్తుంది. అలానే ఆషిక రంగనాథ్ బాగానే చేసినప్పటికీ కొన్ని సీన్స్ చూస్తే ఇక్కడ ఇంకా బెటర్ గా ఆమె చేసే స్కోప్ ఉంది కదా అనిపిస్తుంది. ఇలాంటి వాటిలో తనని లిమిటేషన్ పెట్టుకోకుండా పెర్ఫామ్ చేసి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి. ఇలాంటి కంటెంట్ కి విజువల్స్ ప్రాధాన్యం. వాటికి తగ్గ డిమాండ్ రీత్యా సన్నివేశాలు ఉండాలి కానీ ఇందులో నాచురాలిటీ మిస్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ కూడా ఇంకా బెటర్ గా ఉండాల్సింది. జుదా శాండీ సంగీతం కొన్ని చోట్ల బాగుంది. అలాగే విలియం డేవిడ్ కెమెరా వర్క్ కూడా బాగుంది. ఆషిక్ కుసుగొల్లి ఎడిటింగ్ కొంచెం బెటర్ చేయాల్సింది.
ఇక దర్శకుడు సింపుల్ సుని విషయానికి వస్తే.. తన ఐడియా ఇందులో ఇంట్రెస్టింగ్ గానే ఉంది కానీ ఆవిష్కరించిన తీరులో ఎమోషనల్ పార్ట్ కి ఇంకా బలాన్ని చేకూర్చితే బాగుణ్ణు అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని సీన్స్ వరకు ఎమోషన్స్ బాగానే పండాయి అనిపిస్తుంది. కానీ తాను తీసుకున్న సబ్జెక్టుకి ఇలాంటి తరహా కథనం సరిపడదు. సో ఇంకాస్త గ్రౌండ్ వర్క్ చేసి అవుట్ పుట్ రాబట్టి ఉంటే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ‘గత వైభవం’లో లైన్ ఓకే అనిపించినా దానికి తగ్గ సాలిడ్ ఎలిమెంట్స్ అయితే ఇందులో బాగా మిస్ అయ్యాయి. థీమ్ కి తగ్గ జాగ్రత్తలు మరింత తీసుకోవాల్సింది. లీడ్ జంట పెట్టిన ఎఫర్ట్స్ కి దర్శకుని కథనం సరిగ్గా సెట్ కాలేదు. పైగా సాగదీతగా సాగదీసే కథనం మరింత డిజప్పాయింట్ గా ఉంటుంది. దీనితో ఈ సినిమా బోరింగ్ ఫీల్ నే మిగులుస్తుంది. సో ఈ వీకెండ్ కి ఈ సినిమాని స్కిప్ చేసేయవచ్చు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team


