ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘ఫౌజీ’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రంలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే, ఇటీవల ఈ చిత్రం వాయిదా పడబోతుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా చక్కర్లు కొట్టాయి. డిసెంబర్ 3న ఫౌజీ చిత్రం రిలీజ్ కాదంటూ వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఫౌజీ రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుందని వెల్లడించారు. అనుకున్న సమయానికంటే ఈ సినిమా కొద్దిగా లేటుగా వస్తుందని.. అయితే, ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ ఇది అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దీంతో గతకొద్ది రోజులుగా వినిపిస్తున్న ఫౌజీ పోస్ట్‌పోన్ వార్తలు ఎట్టకేలకు నిజం అయ్యాయి. ఇక ఇప్పుడు ఫౌజీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా.. దానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.


