పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దే కాల్ హిమ్ ఓజీ’ (They Call Him OG) సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ చిత్రంగా ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఇటీవల ప్రకటించాడు. నిర్మాత రామ్ తాళ్లూరి – పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో గతంలో ఓ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరో క్రేజీ అప్‌డేట్ ఇవ్వడంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్‌కు ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ అనే ప్రొడక్షన్ బ్యానర్ ఉంది. ఈ బ్యానర్‌పై ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్, చల్ మోహన్ రంగ, బ్రో వంటి చిత్రాలు నిర్మించబడ్డాయి. తాజాగా ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి పవన్ కళ్యాణ్‌కు సంబంధించి ఓ తాజా అప్డేట్ ఇవ్వబోతున్నట్లు వెలువడింది. చాలా కాలంగా పవన్‌కు మార్షల్ ఆర్ట్స్ పట్ల ఎలాంటి ఆసక్తి ఉందనే విషయంపై ఈ అప్డేట్ ఉండబోతుందని తెలుస్తోంది. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన ఆయన, కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. అదే క్రమశిక్షణ ఆయన యాక్షన్ సన్నివేశాల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే, ఇప్పుడు ఈ తాజా పోస్ట్‌తో ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని చూపిస్తారా.. లేక మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభానికి సంబంధించిందా.. లేక మరో కొత్త సినిమా ప్రాజెక్ట్‌కు సంబంధించిందా.. అనే టాక్ జోరందుకుంది. మరి పవన్ కళ్యాణ్ ఇవ్వబోయే ఈ అప్డేట్ ఏమిటో తెలియాలంటే జనవరి 7 వరకు వెయిట్ చేయాల్సిందే.


