విజయ్ సినిమా వాయిదా తప్పేలా లేదా? రాజా సాబ్ కి రూట్ క్లియర్!?

విజయ్ సినిమా వాయిదా తప్పేలా లేదా? రాజా సాబ్ కి రూట్ క్లియర్!?

Published on Jan 7, 2026 8:02 AM IST

The Raja Saab

ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న మొదటి అవైటెడ్ చిత్రాలు ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ (The Raja Saab) అలాగే తమిళ నటుడు విజయ్ నటించిన జన నాయగన్ ల కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నడుమ రాబోతున్న ఈ సినిమాలు ఒకే డేట్ లో సిద్ధంగా ఉన్నాయి. కాని ఇప్పుడు అనుకున్న డేట్ లో రాజా సాబ్ వచ్చినా జన నాయకుడు వచ్చే ఛాన్స్ అనుమానమే అని వినిపిస్తోంది.

సినిమా ఇంకా సెన్సార్ కాకపోవడం, ఇవాళ మద్రాస్ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. సో కొంచెం అటు ఇటు అయ్యినా జనవరి 9న జన నాయగన్ రిలీజ్ ఉండకపోవచ్చు అనే వినిపిస్తోంది. సో ఇదే నిజం అయితే మాత్రం తెలుగు స్టేట్స్ లో సహా తమిళనాడులో కూడా రాజా సాబ్ కి రూట్ మరింత క్లియర్ అవుతుంది అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అంతా జన నాయగన్ పై వచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు