‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’ తరహాలో ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు హీరో వరుణ్ సందేశ్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హలో ఇట్స్ మీ’. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తూనే షగ్నశ్రీ వేణున్ స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. ఎస్ 2 ఎస్ సినిమాస్, శ్సాస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వి.ఎస్.కె సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. ఇటీవల వరుసగా థ్రిల్లర్ సినిమాలు చేశానని, చాలా కాలం తర్వాత మనసుకు హత్తుకునే మంచి ప్రేమకథలో నటిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. నేటి యువత, ప్రేమ, అపార్థాల నేపథ్యంలో సాగే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందని దర్శకురాలు షగ్నశ్రీ తెలిపారు. హీరోయిన్‌గా చేస్తూనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం పట్ల నిర్మాతలు, అతిథులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
దర్శన్ మదమంచి మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వంశీకాంత్ రేఖన సంగీతం, బ్రహ్మతేజ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


