ఇప్పుడు ఉన్న మార్కెట్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ హీరోస్ కి తాము చేస్తున్న సినిమాలు పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు. వరుస కమిట్మెంట్స్, సమయాన్ని బాలన్స్ చేయడం అనేది పెద్ద టాస్క్ గా మారింది. అయితే ఒకప్పుడు మన హీరోలు ఏకకాలంలో రెండు మూడు ప్రాజెక్ట్ లకి పని చేసేవారు. కానీ ఇప్పుడో ఒక్క ప్రాజెక్ట్ కే రెండు మూడేళ్లు తీసేసుకుంటున్నారు.
అయితే గత కొన్నేళ్ల కితం మాత్రం ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా కనిపించాడు. ఆదిపురుష్, రాధే శ్యామ్, సలార్, కల్కి లాంటి సినిమాలు వరుసగా చేస్తూ వచ్చి ఏడాదికి రెండు సినిమాలు అందించే వర్క్ చేశాడు. అయితే ఫైనల్ గా మళ్ళీ ఇదే బిజీ వర్క్ లైఫ్ లోకి తాను వెళుతున్నట్టు తెలుస్తుంది.
ప్రభాస్ ఇప్పుడు హను రాఘవపుడితో సినిమా అలాగే కల్కి సీక్వెల్ ఇంకా స్పిరిట్ సినిమాలు ఏకకాలంలో కంప్లీట్ చేయనున్నట్టు తెలుస్తుంది. సో మళ్ళీ తాను బ్యాక్ టు బ్యాక్ బిజీగా మారిపోనున్నాడని చెప్పాలి. ఇక సలార్ 2 పై కూడా కొన్ని రూమర్స్ మొదలయ్యాయి కానీ దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


