ఇంకా ‘ఫౌజీ’ నే అవ్వలేదు.. ఇంకా ‘సీతా రామం 2’ అంటారేంటి!

ఇంకా ‘ఫౌజీ’ నే అవ్వలేదు.. ఇంకా ‘సీతా రామం 2’ అంటారేంటి!

Published on Jan 28, 2026 9:00 AM IST

Fauzi Sitha-ramam

మన తెలుగు ఆడియెన్స్ లో తమ డెబ్యూ సినిమా తోనే అలరించిన హీరో హీరోయిన్స్ దుల్కర్ సల్మాన్ అలాగే మృణాల్ ఠాకూర్ లు. తమ మొదటి చిత్రం సీతా రామం (Sita Ramama) సెన్సేషనల్ హిట్ అయ్యింది. మంచి లాంగ్ రన్ ని చూసిన ఈ చిత్రంని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా అప్పుడు ఉండొచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి.

కానీ లేటెస్ట్ గా సీతా రామం 2 (Sita Ramama 2) నుంచే ఈ పిక్ అంటూ ఒక బ్యూటిఫుల్ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇందులో మృణాల్, దుల్కర్ ఇద్దరూ కనిపిస్తున్నారు. దీనితో సీతా రామం 2 అంటూ తెగ వైరల్ చేసేస్తున్నారు నెటిజన్లు. కానీ ఇప్పుడు దర్శకుడు హను రాఘవపూడి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తున్న ‘ఫౌజీ’ (Fauzi) లోనే బిజీగా ఉన్నారు.

పోనీ ఇది దాదాపు ఫినిష్ అయ్యిపోయిందా అంటే అది కూడా లేదు. ‘ఫౌజీ’ (Fauzi) పైనే ప్రస్తుతం హను దృష్టి అంతా ఉంది. సో సీతా రామం 2 నుంచి ఆ పోస్టర్ ఆ సినిమా షూటింగ్ జరుగుతుంది అనేది అవాస్తవం అనుకోవచ్చు. అలాగే ఆ పోస్టర్ సరిగ్గా కూడా ప్రెజెంట్ ట్రెండ్ ఏ ఐ తో చేసిన ఫొటోలా కూడా అనిపిస్తుంది. సో ఇలా కూడా ఆ వార్తల్లో నిజం లేదు అనుకోవచ్చు.

తాజా వార్తలు