పవన్ మరోసారి ఆ రిస్క్ చేస్తాడా.. అస్సలు వద్దంటున్న ఫ్యాన్స్..!

పవన్ మరోసారి ఆ రిస్క్ చేస్తాడా.. అస్సలు వద్దంటున్న ఫ్యాన్స్..!

Published on Jan 29, 2026 12:30 AM IST

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఎప్పుడో 2019లో షూటింగ్ మొదలు పెట్టుకుని, అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ చివరకు 2025లో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే, ‘హరిహర వీరమల్లు’ మొదటి భాగానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. దర్శకుడు జ్యోతి కృష్ణ, క్రిష్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు.

దీంతో ఈ సినిమా సీక్వెల్ గురించి అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు పార్ట్ 2 పై ఓ కొత్త చర్చ సాగుతోంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తయిందని హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవల తెలపడంతో పార్ట్ 2పై మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు అర్థమైంది. మరి దర్శకుడు జ్యోతి కృష్ణ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాడని కూడా చిత్ర వర్గాల టాక్.

అయితే, పవన్ కళ్యాణ్ ఈ పార్ట్ 2 చిత్రాన్ని చేసేందుకు రిస్క్ చేస్తాడా..? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తొలి భాగం అనుకున్న రేంజ్‌లో విజయం సాధించకపోవడంతో, పవన్ సీక్వెల్ చేయకపోవడమే బెటర్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు