‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రమోషన్స్ ప్రారంభం.. ‘న్యాయం చేయరా దేవుడా’ సాంగ్ రిలీజ్

‘ధర్మస్థల నియోజకవర్గం’ ప్రమోషన్స్ ప్రారంభం.. ‘న్యాయం చేయరా దేవుడా’ సాంగ్ రిలీజ్

Published on Mar 18, 2026 6:00 AM IST

Chandrabose

సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పొలిటికల్ ఎంటర్‌టైనర్‌ ‘ధర్మస్థల నియోజకవర్గం’. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ‘న్యాయం చేయరా దేవుడా..’ అనే లిరికల్ పాటను ఆస్కార్ విజేత చంద్రబోస్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

ఈ ప్రత్యేక గీతానికి చంద్రబోస్ సాహిత్యం అందించగా, ప్రముఖ గాయని సునీత ఆలపించారు. మహావీర్ ఎల్లంధర్ సంగీతం సమకూర్చారు. పాట ఆవిష్కరణ అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ.. సినిమా కాన్సెప్ట్, దర్శకుడి విజన్ చాలా బాగున్నాయని, మంచి సందేశం ఉన్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ నర్తించిన ఈ ఐటెం సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట తెలిపారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఒక సరికొత్త పొలిటికల్ ఎమోషనల్ డ్రామాగా దీనిని తెరకెక్కించినట్లు చెప్పారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే టీజర్‌తో పాటు సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత మేరుం భాస్కర్ స్పష్టం చేశారు.

తాజా వార్తలు