అంధునిగా హృతిక్.. ఆ రివెంజ్ డ్రామాకి సీక్వెల్ హోప్ ఇస్తున్న దర్శకుడు!

అంధునిగా హృతిక్.. ఆ రివెంజ్ డ్రామాకి సీక్వెల్ హోప్ ఇస్తున్న దర్శకుడు!

Published on Jan 31, 2026 8:19 AM IST

Kaabil 2

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి స్టార్ అండ్ ఫైనెస్ట్ నటుల్లో హీరో హృతిక్ రోషన్ (Hrithik Dosham) కూడా ఒకరు. కేవలం తన లుక్స్, యాక్షన్ హీరోగానే కాకుండా ఎన్నో సినిమాల్లో నటునిగా ఛాలెంజింగ్ రోల్స్ తో ప్రయోగాలు కూడా చేశారు. అలా హృతిక్ చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లో ఒకటే “కాబిల్” (Kaabil). 2017 లో బలం పేరిట తెలుగులో కూడా విడుదల అయ్యిన ఈ సినిమాకి సీక్వెల్ కోసం ఇప్పుడు చర్చ మొదలైంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఒక అంధుని పాత్రలో కనిపించారు.

అయితే ఇటీవల వచ్చిన ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ పై దర్శకుడు సంజయ్ గుప్తా స్పందిస్తూ సీక్వెల్ ఎందుకు చెయ్యకూడదు అన్నట్టుగా ఫ్యాన్స్ కి చిన్న హోప్ ని అందించారు. అంతే కాకుండా దీనికి ఇప్పుడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్న టాలెంటెడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ (King Director Siddharth Anand) కూడా రిప్లై ఇచ్చి తన ఎగ్జైట్మెంట్ ని చూపిస్తున్నారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ సీక్వెల్ సాధ్యం అవుతుందో లేదో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో రీసెంట్ సెన్సేషన్ ధురంధర్ (Dhurandhar) దర్శకుడు ఆదిత్య ధర్ భార్య సందీప ధర్ హీరోయిన్ గా నటించారు.

తాజా వార్తలు