అందుకే నా మాజీ ప్రేమికుడ్ని వదిలేశా – మృణాల్‌ ఠాకూర్‌

అందుకే నా మాజీ ప్రేమికుడ్ని వదిలేశా – మృణాల్‌ ఠాకూర్‌

Published on Feb 2, 2026 11:00 PM IST

mrunal thakur

హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌ ప్రేమ, పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఐతే, తాజాగా ఆమె తన మాజీ ప్రేమికుడి గురించి చెప్పి మరోసారి నెట్టింట వైరల్‌గా మారారు. తన కొత్త సినిమా ‘దో దీవానే శహర్‌ మే’ సినిమా ప్రచారంలో భాగంగా తన మాజీ ప్రేమికుడి గురించి మృణాల్ మాట్లాడుతూ.. ‘నాకు దూకుడు ఎక్కువని నాతో ఉండలేనని బ్రేకప్‌ చెప్పాడు. నేను యాక్టింగ్‌ చేయడం కూడా తనకు నచ్చలేదు. విడిపోవడానికి అది కూడా ఓ కారణం. బ్రేకప్ చెప్పినందుకు నేనేం బాధపడలేదు. తన మనస్తత్వం గురించి జాలి పడ్డాను’ అని మృణాల్ తెలిపింది.

మృణాల్ ఇంకా మాట్లాడుతూ.. ‘అలాంటివాళ్లతో కొనసాగడం నాకు కూడా కష్టమే. అందుకే విడిపోయాం. అలాంటివాళ్లతో ఉంటే భవిష్యత్తులో పిల్లలు కూడా అదే భావనలతో పెరుగుతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే, అతనితో చాలా దూరం వెళ్లినప్పటికీ.. అతనికి దూరం జరిగాను’ అని మృణాల్ చెప్పింది. ఇక గత కొన్ని నెలలుగా మృణాల్‌, హీరో ధనుష్‌ తో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ధనుష్‌ తనకు మంచి స్నేహితుడంటూ ఆ ప్రచారాన్ని మృణాల్‌ ఆ వార్తలను ఖండించింది.

తాజా వార్తలు