ఓటీటీ వేదిక : ఈటీవీ విన్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : ఫిబ్రవరి 8, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : అజయ్, ఆదిత్య, వర్షు, దక్షి, రమ్య పొందురీ తదితరులు
దర్శకత్వం : గంగణమోని శేఖర్
నిర్మాత : రాఘవేంద్రరావు బి ఎ
సంగీతం : సాయి మధుకర్
సినిమాటోగ్రఫీ : రాఘవేంద్ర వట్టెల
ఎడిటింగ్ : వెంకట్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ నే గోల్డ్ అండ్ గీత (Gold And Geetha). దర్శకుడు రాఘవేంద్రరావు కథ, కథనాలతో వచ్చిన ఈ లఘు చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
Gold And Geetha కథ:
పేరు మోసిన పారిశ్రామికవేత్తల కొడుకులైన అర్జున్, కిరణ్ (ఆదిత్య, అజయ్ కతుర్వార్) లు వారి తండ్రుల కీర్తికి భంగం కలిగించేలా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటారు. ఇలా ఓ యాక్సిడెంట్ చేసిన నేపథ్యంలో ఇద్దరి తండ్రులు వారికి ఒక్క నెల సమయం ఇచ్చి తమ పేరు, పరపతి వాడకుండా లక్ష రూపాయలు సంపాదించి రమ్మని ఛాలెంజ్ చేస్తారు. ఇలా సంపాదించే ప్లానింగ్ లో ఓ నిధి వేటలోకి తమ గర్ల్ ఫ్రెండ్స్ తో దిగుతారు. మరి ఈ వేటలో తాము తెలుసుకుంది ఏంటి? అనుకున్నట్టు డబ్బు సంపాదించారా లేదా అనేవి ఇందులో మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రంలో కొద్ది సేపటికే మెయిన్ అంశంలోకి తీసుకెళ్లడం బాగుంది. మోడ్రన్ యుగంలో నిధి వేట లాంటి కాన్సెప్ట్ పైగా ఈ కథా సుధలో మిగతా ఫామిలీ లైన్స్ వంటి వాటికి భిన్నంగా టచ్ చేయడంతో ఆ కొన్ని నిమిషాల కథనం ఓకే అనిపిస్తుంది.
అలాగే చివరిలో ఇచ్చిన భగద్గీతతో కూడిన ముగింపు, సందేశం ఇందులో ఓకే అనిపిస్తాయి. ఇక వీటితో పాటుగా యువ నటులు అజయ్, ఆదిత్యలు పర్వాలేదు అనిపించే రేంజ్ లో నటన కనబరిచారు. మధ్యలో కొన్ని చోట్ల వీరి కామెడీ టైమింగ్ బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ లఘు చిత్రంలో ఒక సరైన సీరియస్ నెస్ తో కూడిన కథనం ఎక్కడా కనిపించదు. ఓకే ఇదొక నిధి వేట మంచి అడ్వెంచర్ తో కూడిన ఇంట్రెస్టింగ్ అటు పోట్లు లాంటివి ఉంటాయి అనుకుంటే ఇందులో చాలా చప్పగా కథనం సాగుతుంది. ఆ ఇద్దరు ఫీమేల్ లీడ్స్ ని ఇరికించినట్టు భావన కలుగుతుంది.
వీరితో సీన్స్ ఏ కోశాన కూడా ఇంట్రెస్ట్ తెప్పించవు. చాలా సిల్లీగా వెళ్తూ మధ్యలో కథనం అంతా బోర్ గానే సాగుతుంది. ఇక క్లైమాక్స్ కొన్ని నిమిషాల్లో భగవద్గీతతో మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ దానికి ముందు నడిపించిన కథనంకి ఈ ముగింపుకి పొంతన కనిపించదు.
అప్పటి వరకు సిల్లీగా నడిపించి చివరిలో సింపుల్ గా జ్ఞానోదయం కలిగిస్తాను అంటే చూసే ఆడియెన్స్ కి కూడా అది అంత అర్థవంతంగా ఉండదు. మధ్యలో ఆ సాంగ్ కూడా అనవసరం. ఈ మోడ్రన్ టైం లో కూడా సింపుల్ గా ఒకరు నిధి కోసం అనే టాపిక్ నే కొంచెం రియాలిటీకి దూరంగా ఉంటుంది. సరే పోని ఇది ఫాంటసీ ఎలిమెంట్ తో టచ్ చేస్తూ మంచి అడ్వెంచర్ గా సాగిందా అంటే అదీ లేదు.
ఇంకా వీరికి నిధి తాలూకా పెట్టె దొరికినప్పుడు గమనిస్తే దేవీ పుత్రుడు సినిమాలో పవర్ బాక్స్ అనేది ఒకటి ఉంటుందిగా దానికి మినీ వెర్షన్ ని ఇందులో డిజైన్ చేసారు. కనీసం ఒక కొత్త వస్తువుని కూడా క్రియేట్ చేసుకోలేకపోవడం ఇందులో బాధాకరం.
సాంకేతిక వర్గం:
ఇందులో నిర్మాణ విలువలు పర్వాలేదు. నిధి నిక్షిప్తం చేయడానికి కనీసం ఒక కొత్త పెట్టెని కూడా డిజైన్ చేసుకోలేకపోయారు. సంగీతం ఓకే, కెమెరా వర్క్ కూడా బానే ఉంది. ఎడిటింగ్ లో సాంగ్ తీసేసి కథనం కొంచెం ఫాస్ట్ గా నడిపించాల్సింది.
ఇక దర్శకుడు గంగణమోని శేఖర్ విషయానికి వస్తే.. తన వర్క్ మాత్రం మెప్పించలేదు. మంచి స్కోప్ ఉన్న లైన్ నే ఇంట్రెస్టింగ్ గా నడిపి నటీనటులు నుంచి మంచి పెర్ఫామెన్స్ లని రాబట్టాల్సి ఉంది కానీ తన వర్క్ మాత్రం ఇందులో ఫోర్స్డ్ గా వీక్ గా అనిపిస్తుంది. రాఘవేంద్రరావు గారికి డివోషనల్ కంటెంట్ కి మంచి అనుబంధం ఉంది కాని ఇందులో తన స్క్రీన్ ప్లే అంత సహజంగా అనిపించలేదు. ఇంకా మెరుగ్గా ప్లాన్ చేసుకోవాల్సింది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘గోల్డ్ అండ్ గీత’ (Gold And Geetha) లఘు చిత్రం ఒక ఆకట్టుకోని అటెంప్ట్ అని చెప్పాలి. స్టార్టింగ్ కొన్ని నిమిషాలు చివరి కొంత సేపు ఓకే కానీ మిగతా కథనం అంతా రియాలిటీకి దూరంగా ఫోర్సెడ్ గా అనిపిస్తుంది. ఇంకా బెటర్ గా తీయదగిన కంటెంట్ ఇది కానీ పేలవంగా నడిపించారు. సో ఈ లఘు చిత్రం ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team


