మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన రామ్ చరణ్ ‘పెద్ది’ గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌లో ఒక అద్భుతమైన సర్ప్రైజ్ చోటుచేసుకుంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాలోని థీమ్ సాంగ్ ‘మస్సా మస్సా మాస్సా’ను వేదికపై లైవ్‌గా పర్ఫార్మ్ చేసి అభిమానులను ఊర్రూతలూగించాడు. రెహమాన్ స్వయంగా స్టేజి పై ఈ పాటను పాడటంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
అద్భుతమైన కంపోజిషన్, మనసుల్ని హత్తుకునే లిరిక్స్ మరియు అద్భుతమైన గాత్రంతో సాగిన ఈ ట్రాక్ వినగానే ఇన్‌స్టంట్‌గా అందరినీ ఆకట్టుకుంటోంది. కేవలం మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా, ఈ పాటలో మంచి ఎమోషనల్ డెప్త్ కూడా కనిపిస్తోంది. సినిమాలో కథా పరంగా అత్యంత కీలకమైన సందర్భంలో ఈ థీమ్ సాంగ్ రాబోతుందని చిత్ర వర్గాల సమాచారం.
సాధారణంగానే ఇలాంటి గూస్‌బంప్స్ తెప్పించే ట్రాక్స్ ఇవ్వడంలో ఏఆర్ రెహమాన్ స్టైలే వేరు. ఇప్పుడు ‘మస్సా మస్సా మాస్సా’ సాంగ్‌తో ఆయన మరోసారి తన మార్క్ చూపించి అందరినీ ఇంప్రెస్ చేశాడు. లైవ్ పర్ఫార్మెన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ క్రేజీ థీమ్ సాంగ్‌ను డిజిటల్ మరియు ఆడియో ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎప్పుడు విడుదల చేస్తారా అని మ్యూజిక్ లవర్స్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


