మార్చి అని చెప్పి ఏమార్చారు.. ఇక ఉస్తాద్ ఒక్కడిపైనే ఆశలు..!

మార్చి అని చెప్పి ఏమార్చారు.. ఇక ఉస్తాద్ ఒక్కడిపైనే ఆశలు..!

Published on Mar 4, 2026 7:02 PM IST

ustaad-bhagat-singh

టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉన్న సమ్మర్ సీజన్ గతేడాది బోసిపోయింది. భారీ చిత్రాలు ఏవీ లేక కేవలం మీడియం రేంజ్ హీరోల చిత్రాలతో ప్రేక్షకులు సరిపెట్టుకున్నారు. అయితే, 2026 సమ్మర్ ఆరంభం అయిన మార్చితోనే టాలీవుడ్ బాక్సాఫీస్ భారీ చిత్రాలతో కళకళలాడుతుందని పలు చిత్రాల దర్శకనిర్మాతలు ప్రకటించారు.

ఇందులో ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేస్తామని చెప్పగా, నాని ‘ది ప్యారడైజ్’ మార్చి 27న రిలీజ్ పక్కాగా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలో వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఈ రెండు చిత్రాలు కూడా తమ రిలీజ్‌ను వాయిదా వేశారు. ‘పెద్ది’ చిత్రాన్ని ఏప్రిల్ 30కి, ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని ఆగస్టుకి వాయిదా వేశారు.

వీటితో పాటు మార్చిలో రిలీజ్ కావాల్సిన ‘టాక్సిక్’ చిత్రం కూడా ఇప్పుడు వాయిదా పడింది. మరో భారీ చిత్రం ‘ధురంధర్ 2’ కూడా మార్చి 19న రిలీజ్ ప్రకటించినా, ఆ రోజున వచ్చే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఇక మార్చిలో కన్ఫమ్ రిలీజ్ కాబోయే సినిమాగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రమే ఉండటంతో ఆ సినిమాపైనే అభిమానులు ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇన్ని చిత్రాలను మార్చి నెలలో తప్పక తీసుకువస్తామని చెప్పిన మేకర్స్ ఇప్పుడు తమ సినిమాలను వాయిదా వేసుకోవడంతో ప్రేక్షకులు మండిపడుతున్నారు.

తాజా వార్తలు