డాన్స్ ఎప్పటికీ నా హ్యాపీ ప్లేస్.. ‘పెద్ది’ రామ్ చరణ్ పోస్ట్ వైరల్

డాన్స్ ఎప్పటికీ నా హ్యాపీ ప్లేస్.. ‘పెద్ది’ రామ్ చరణ్ పోస్ట్ వైరల్

Published on Mar 8, 2026 7:59 PM IST

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న అవైటెడ్ చిత్రం పెద్ది కోసం అందరికీ తెలిసిందే. అభిమానులు ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ పెద్ద చార్ట్ బస్టర్ అయ్యాయి. లేటెస్ట్ గా వచ్చిన మాస్ సాంగ్ రయ్ రయ్ రారా లో రామ్ చరణ్ మాస్ స్టెప్పులు పాన్ ఇండియా లెవెల్లో వైరల్ గా కూడా మారాయి.

అయితే తన ‘డాన్స్’ పై చరణ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పెద్ది నుంచి తన హుక్ స్టెప్ ని పోస్ట్ చేసి రామ్ చరణ్ డాన్స్ ఎప్పటికీ తన హ్యాపీ ప్లేస్ అంటూ చరణ్ పోస్ట్ చేసాడు. దీనితో తన పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి ఈ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఏప్రిల్ 30న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు