పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకి కరెక్ట్ సినిమా పడితే దాని తాలూకా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనేది ఓజి చూపించింది. డే 1 కి ఏకంగా 150 కోట్లకి పైగా ఓపెనింగ్స్ ఇందులో దాదాపు మొత్తం కేవలం తెలుగు వెర్షన్ లోనే రాబట్టి హిస్టరీ సెట్ చేసింది. ఇక ఇదే కాకుండా ఈ సినిమా పైడ్ ప్రీమియర్స్ లో కూడా ఇండియా వైడ్ భారీ రికార్డ్ సెట్ చేసింది.
కేవలం ప్రీమియర్స్ కి 30 కోట్లకి పైగా రాబట్టింది. ఈ రికార్డ్ ఇప్పుడు వరకు పదిలంగానే ఉంది కానీ దీనిపై అవైటెడ్ సీక్వెల్ చిత్రం “ధురంధర్ 2” కన్నేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ముందు రోజు ప్రీమియర్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. మరి ఇండియా వైడ్ ఆల్రెడీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. సో ధురంధర్ 2 పవన్ ఓజి రికార్డ్ బ్రేక్ చేసి ఇండియన్ సినిమా రికార్డ్ ప్రీమియర్స్ ని సెట్ చేస్తుందో లేదో చూడాల్సిందే.


