రవితేజ ‘ఇరుముడి’లో మరో హీరోయిన్ ?

రవితేజ ‘ఇరుముడి’లో మరో హీరోయిన్ ?

Published on Mar 9, 2026 7:00 PM IST

Irumudi

రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించబోతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేశారట. ఈ రోల్ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని శివ నిర్వాణ ఈ పాత్రను పెట్టాడట.

ఇక ‘కొన్ని కథలు జీవితంలో సరైన సమయంలో మనల్ని ఎంచుకుంటాయి. అలాంటి ఒక కథే ఈ ఇరుముడి. ఇందులో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొత్త ప్రయాణంలో ఉత్సాహంగా ఉన్నా’’ అని రవితేజ ఆ మధ్య చెప్పుకొచ్చారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియా భవానీ శంకర్‌ నటిస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బేబీ నకాస్త్ర రవితేజ కుమార్తెగా నటిస్తోంది.

తాజా వార్తలు