ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎల్ ఫీవర్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ లో సినిమా కూడా అంతర్లీనంగా లింక్ అయ్యే ఉంటుంది. ఇలా చాలానే టీం లు మన తెలుగు సినిమాల హీరోలు, వారి పాటలు సీన్స్ తో తమకి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇలానే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఐపీఎల్ లో టాప్ మోస్ట్ టీం లలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి.
వారు ఎలాగో తమిళ్ వాళ్ళే కాబట్టి వాళ్ళకే బోలెడు పాటలు సినిమాలు ఉన్నాయి అవే వేసుకునేవారు. ముఖ్యంగా అనిరుద్ కంపోజ్ చేసిన పాటలు దాదాపు చెన్నై టీం, ఎం ఎస్ ధోని పైనే వేస్తూ ఉంటారు. ఇప్పుడు దీనిపైనే చెన్నై జట్టుపై అదే తమిళనాడుకి చెందిన నిర్మాణ సంత సన్ పిక్చర్స్ వారు లా సూట్ కేసు వేసినట్టు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది.
తమిళనాడుకి చెందిన నిర్మాణ సంస్థ తమ నేలకి చెందిన జట్టుపైనే కేసు వేయడం ఒకింత షాకింగ్ అనే చెప్పాలి మరి. తమ పర్మిషన్ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ వారు జైలర్, జైలర్ 2 అలాగే కూలీ లాంటి సినిమాల పాటలు డైలాగ్ లు అనధికారికంగా వాడుకున్నారు అని 1 కోటి జరిమానా కట్టాలని డిమాండ్ అట. దీనితో ఊహించని ట్విస్ట్ సినీ, క్రికెట్ లవర్స్ లో వైరల్ గా మారింది.


