మహేష్ సెంటిమెంట్ పై ‘శ్రీనివాస మంగాపురం’ కన్ను.. కలిసొచ్చేనా..?

మహేష్ సెంటిమెంట్ పై ‘శ్రీనివాస మంగాపురం’ కన్ను.. కలిసొచ్చేనా..?

Published on Apr 18, 2026 1:02 AM IST

Srinivasa-Mangapuram

ఘట్టమనేని కుటుంబం నుండి మరో వారసుడు వెండితెరపై మెరవడానికి సిద్ధమయ్యాడు. దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, మే నాటికి షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

​ఈ సినిమా విడుదల తేదీపై మేకర్స్ ఒక ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు డెబ్యూ ఫిల్మ్ ‘రాజకుమారుడు’ 1999, జూలై 30న విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అదే తేదీన, అంటే జూలై 30న జయకృష్ణ సినిమాను కూడా విడుదల చేయాలని నిర్మాత సి. అశ్వనీదత్ గట్టి పట్టుదలతో ఉన్నారట. ఘట్టమనేని వారసుల అరంగేట్రానికి ఈ తేదీ ఒక శుభసూచకమని మేకర్స్ నమ్ముతున్నారు.

​గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రంలో రషా తడానీ హీరోయిన్ గా నటిస్తుండగా, మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సి.అశ్వనీదత్ మరియు జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి మహేష్ సెంటిమెంట్ జయకృష్ణ కి కూడా కలిసొస్తుందా అనేది చూడాలి.

తాజా వార్తలు