దీపికా, రణ్వీర్ ల గుడ్ న్యూస్ వారికి టెన్షన్ తీసుకొస్తుందా!

దీపికా, రణ్వీర్ ల గుడ్ న్యూస్ వారికి టెన్షన్ తీసుకొస్తుందా!

Published on Apr 19, 2026 3:00 PM IST

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ అలాగే దీపికా పదుకోణ్ లు ఇప్పుడు పలు భారీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రణ్వీర్ సింగ్ ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ హిట్ ని కొట్టాడు. కానీ దీనిపై ఎలాంటి స్పందన అందించలేదు అని సొంత భర్త సక్సెస్ ని కూడా ఆమె ఓర్వలేదా అంటూ అనేక ట్రోల్స్, కామెంట్స్ వచ్చాయి.

కానీ అనూహ్యంగా ఈ కామెంట్స్ మధ్యలో దీపికా, రణ్వీర్ లు మరో ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడం సర్ప్రైజింగ్ గా మారింది. దీనితో వీరి నడుమ ఎలాంటి గ్యాప్ లేదని ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఈ గుడ్ న్యూస్ మాత్రం కొందరిలో కొంచెం టెన్సన్ తెచ్చింది. వర్క్ పరంగా దీపికా ఎంత పక్కాగా ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే.

దీనితో ఇపుడు ఆమె చేస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి? చేయనున్న సినిమాల సంగతి ఏంటి అనేది ఇప్పుడు నుంచే ప్రశ్నగా మారింది. మెయిన్ గా రాకా, ఇతర బాలీవుడ్ సినిమాలలో దీపికా ఇప్పుడు నటిస్తుంది. మరి వాటిని ఆమె పూర్తి చేస్తుందా లేక.. ఆలస్యం చేస్తుందా అనేది ఒకింత టెన్షన్ గా మారింది. సో వీటిని దీపికా ఎలా హ్యాండిల్ చేస్తుందో అనేది చూడాలి.

తాజా వార్తలు