‘బైకర్’ ఓటిటి డేట్ లాక్ అయ్యిందా?

‘బైకర్’ ఓటిటి డేట్ లాక్ అయ్యిందా?

Published on Apr 21, 2026 8:11 AM IST

రీసెంట్ గా తెలుగు సినిమా నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ చిత్రమే ‘బైకర్’. టాలెంటెడ్ హీరో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా మాళవిక నైర్ హీరోయిన్ గా దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 40 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటిటి డేట్ ని లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా వారు ఈ సినిమాని మే 1 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి జిబ్రాన్ సాలిడ్ మ్యూజిక్ వర్క్ అందించగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు