టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ మేకప్ వేసుకోబోతున్నాడు. వరుస పరాజయాల నేపథ్యంలో గతేడాది విడుదలైన ‘తమ్ముడు’ సినిమా తర్వాత సుమారు ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న ఆయన, ఇప్పుడు వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టాడు. ఇందులో భాగంగా డెబ్యూ దర్శకులు సోము మరియు నర్రి దర్శకత్వంలో నితిన్ తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రారంభించనున్నాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ మే 4వ తేదీన హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. మే 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయాలని నితిన్ భావిస్తున్నాడు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాతో పాటు నితిన్ మరో ఆసక్తికర ప్రాజెక్టుకు కూడా పచ్చజెండా ఊపాడు. వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. కొత్త దర్శకులు, వైవిధ్యమైన కథలతో ఈసారి ఎలాగైనా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని నితిన్ పట్టుదలగా ఉన్నాడు.


