మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి లేటెస్ట్ గా సెన్సేషనల్ ట్రీట్ ఇచ్చిన చిత్రమే “డ్రాగన్”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ట్రీట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి అయ్యి ఈపాటికే విడుదల కావాల్సి ఉంది కానీ మేకర్స్ పర్ఫెక్షన్ కోసం కొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.
అయినప్పటికీ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ చూసి చాలామంది షాక్ అయ్యారు. అసలు షూటింగ్ నత్తనడకన అవుతుంది అనుకుంటున్నాం అంటే నీల్ ఎపుడు ఇంత ఫుటేజ్ చిత్రీకరించారు అని చాలా మంది షాకయ్యారు. అయితే ఇప్పుడు మొత్తం షూట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.
దీని ప్రకారం డ్రాగన్ ప్రస్తుతానికి 50 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సో ఇంకా సగం షూట్ బాకీ ఉందని చెప్పవచ్చు. దీనిని కూడా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఆన్ టైం మేకర్స్ ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.


