గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును ఆయన అభిమానులు పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక బాలయ్య అభిమానుల కోసం ఓ సాలిడ్ బర్త్ డే ట్రీట్‌ను ఇస్తామని NBK111 మేకర్స్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. వారు చెప్పినట్లుగానే ఈ చిత్రానికి సంబంధించిన పవర్ ప్యాక్డ్ ట్రీట్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
1 నిమిషం 31 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రీట్ అభిమానుల ఎదురుచూపులకు పర్ఫెక్ట్‌గా ఉంది. బాలయ్య సరికొత్త లుక్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ అదిరిపోయాయి. ఇక గోపీచంద్ మలినేని ముందు నుండి చెబుతున్నట్లు ఈ సినిమాలో వింటేజ్ బాలయ్యను కాకుండా న్యూ ఏజ్ బాలయ్యను మనకు చూపెట్టాడు. బాలయ్య ఎంట్రీకి థమన్ అందించిన స్కోర్ ప్యూర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. బాలయ్య మాస్ ఇమేజ్‌కు థమన్ ఇచ్చిన సౌండింగ్ అభిమానుల్లో రీసౌండ్ క్రియేట్ చేస్తోంది.
మొత్తానికి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానుల ఆకలి తీర్చేలా ఈ NBK111 ట్రీట్ ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


