‘పెద్ది’ ఎఫెక్ట్: మా బుడ్డది ఇలా పిలవడం స్టార్ట్ చేసింది – చరణ్ కామెంట్స్

‘పెద్ది’ ఎఫెక్ట్: మా బుడ్డది ఇలా పిలవడం స్టార్ట్ చేసింది – చరణ్ కామెంట్స్

Published on Jun 24, 2026 2:15 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం పెద్ది గ్రాండ్ సక్సెస్ కావడంతో మేకర్స్ నేడు శిల్ప కళావేదికలో సక్సెస్ మీట్ ని పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అతిరథ మహాశయుల సమక్షంలో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ స్పీచ్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే తన స్పీచ్ లో జనం తను పోషించిన పెద్ది రోల్ ని ఎంతలా దగ్గరకు తీసుకున్నారో అనేది చెప్తూ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని తన గారాల పట్టి క్లింకారా విషయంలో రివీల్ చేసాడు.

అంతకు ముందు వరకు నాన్న అని పిలిచే మా బుడ్డది ఈ సినిమా చూశాక ఏ పెద్ది అని పిలవడం స్టార్ట్ చేసింది అని.. లేదంటే ఏ పెద్ది నాన్న అంటూ పిలుస్తుంది అని తన లైఫ్ లో పెద్ది పాత్ర అందించిన ఒక గొప్ప అనుభూతిని షేర్ చేసుకున్నారు. దీనితో మెగా అభిమానులు ఈ బ్యూటిఫుల్ మూమెంట్ పట్ల మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు