దర్శకుడు నాగ్ అశ్విన్ మరియు పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ని రూపొందిస్తున్నారు మేకర్స్. అయితే, ఈ క్రేజీ సీక్వెల్ గురించి నాగ్ అశ్విన్ తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
దర్శకుడి విజన్‌ను పూర్తిగా నమ్మి సహకరించే ప్రభాస్ వంటి సూపర్‌స్టార్ తనతో ఉండటం అదృష్టమని నాగ్ అశ్విన్ కొనియాడారు. ఈ భారీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుందని తెలిపారు. జూన్ 2027 నాటికి సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపారు.
ఫస్ట్ పార్ట్ కంటే ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్ స్కేల్‌లో, టాప్ టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కించనున్నట్లు దర్శకుడు స్పష్టం చేశారు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, ఈసారి ఎమోషన్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా మరింత బలంగా ఉండబోతున్నాయని చెప్పారు. దీంతో ‘కల్కి 2’ పై అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లో అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయి.


