ఇంటర్వ్యూ: ఆ క్రెడిట్ అంతా తారక్ దే – సత్యదేవ్!

ఇంటర్వ్యూ: ఆ క్రెడిట్ అంతా తారక్ దే – సత్యదేవ్!

Published on Jul 29, 2021 4:19 PM IST

తిమ్మరుసు జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే?

సృజన్ ఎరబోలు అని ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్, అయిన యూ ఎస్ లో ఉంటారు, మేం పడుకున్నప్పుడు అయిన మెళుకువ గా ఉండి, ఆయన పడుకున్నప్పుడు మేం మెళుకువ గా ఉన్న టైం లో చేస్తుంటారు. అయితే ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యా లాంటి కంప్లీట్ డిఫరెంట్ జానర్ ఫిల్మ్, అంటే కొత్త మేకర్స్, కొత్త తరం ప్రేక్షకులు కోరుకుంటున్నా సినిమా అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం నుండి కొంచెం మేకొవర్ కావాలి, అంటే కొంచెం స్టైలిష్ గా ఉండేలా సినిమా చేద్దామని చర్చ జరిపిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక సాధారణం గా సినిమాల్లో ఫైట్స్ చేయను, కాబట్టి కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి కొత్తగా ట్రై చేద్దాం అని కొత్త డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ కదా అని స్టార్ట్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చారు.

ఇలా ఫామ్ అయిన టీమ్, నేను శరణ్, ఒక ఐడియా సృజన్ ది, మరొక ఐడియా శరణ్ ది, దీనికి ప్రాపర్ ఎగ్జిగ్యూషన్ మహేష్ కోనేరు లా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ తో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఇలా సృజన్ మహేష్ కోనేరు ల తో కలిసి ఈ సినిమా చేయడం జరిగింది అని అన్నారు. ఇలా 39 డే స్ లో సినిమా కంప్లీట్ చేయడం, అది కూడా కోవిడ్ టైం లో సింగిల్ షెడ్యూల్ లో చేసినట్లు తెలిపారు. అలా టీమ్ అంతా ఎంత హార్డ్ వర్క్ చేశారో, అదే విధంగా ప్రొడక్షన్ టీమ్ అంతా కలిసి హార్డ్ వర్క్ చేసి ఫినిష్ చేశాం అని అన్నారు.

అయితే ఇప్పటి వరకు కాప్ థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చూశాం కానీ, యాక్షన్ డ్రామా ఉన్నా కానీ, లాయర్ పర్స్పెక్టివ్ నుండి వచ్చిన థ్రిల్లర్ ఇది అని అన్నారు. న్యాయం కోసం పోరాడి, ఉన్న డబ్బును కూడా ఖర్చు పెట్టీ, నిజం వైపు నిల్చువాలి అనుకొనే ఒక లాయర్, అదే విధంగా కోర్ట్ రూమ్ డ్రామా మాత్రమే కాకుండా, యాక్షన్ డ్రామా ఇది అని అన్నారు.

ఈ మధ్య కోర్ట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి, నాంది, వకీల్ సాబ్ లాగా!

రైట్. అనుకోని ఒక ట్రెండ్. అన్నీ బాగా ఆడాయి కాబట్టి, మేము కూడా ఒక కాన్ఫిడెంట్ తో ఉన్నాం అని అన్నారు. మాది కూడా చాలా బాగుంటది. సిమిలారిటీ స్ ఏమి ఉండవు. కానీ కథ చాలా డిఫెరెంట్ అంటూ చెప్పుకొచ్చారు. లాయర్ రామచంద్ర పాత్ర, అభిలాష లో చిరంజీవి లాంటిది. లాయర్ బేస్ సినిమా అంటే చిన్న క్యూరియాసిటి అంటూ చెప్పుకొచ్చారు. సిమిలారిటిస్ ఏమీ లేవు అని అన్నారు. యావజ్జీవ శిక్ష ను తప్పించడానికి లాయర్ చేసే పోరాటం అంటూ చెప్పుకొచ్చారు.

బేస్ కథ అంటే?

మెయిన్ ప్లాట్ తీసుకొని మన ఎలిమెంట్స్ కి, సెన్సిబిలిటీ కి యాడ్ చేసుకొని చేయడం జరిగింది. బేస్ కథ అంటే న్యాయం కోసం పోరాడే ఒక వ్యక్తి. అసైన్మెంట్ వాలి ఎంటి, ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కార్ నుండి బైక్ కి వెళ్ళే రకం వీడు అని, అలాంటి వాడికి ఒక కేస్ వస్టే చివరి వరకు అంతు చూసే ఒక లాయర్. కానీ ట్విస్ట్, టర్మ్స్, సెక్షన్స్, ఐపిసి ఇంత డ్రామా ఉంటుంది అని ఫస్ట్ టైం వాడం అని అన్నారు.

సినిమా ఎంటైర్ టైన్మెంట్ గా ఉంటుందా, సీరియస్ గా ఉంటుందా?

డెఫినెట్ గా ఎంటర్ టైన్మెంట్ ఉంది, ముందుగా ఎంటర్ టైన్మెంట్ ఉంటుంది, మెల్లగా కేస్ లోకి కథ వెళ్తుంది. మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఆల్ ది ఎమోషన్స్. సీరియస్ పాత్ర కాదు, విట్టి పాత్ర, తెలివైన వాడు, స్మార్ట్ ఫెలో, ఫన్ లవింగ్ ఫెలో, అలాంటి వాడు ఒక కేస్ ను డీల్ చేస్తే, షేర్ లాక్ లాంటి పాత్ర అనుకో, ఫన్ కూడా చేస్తాడు కదా అని అన్నారు. అలా ఒక లాయర్ రామ చంద్ర అనుకోవచ్చు.

వాదనలు, ప్రతి వాదనలు ఉంటాయి, అలాంటి వాటికోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

ఇందులో కూడా చాలా లెంగ్త్ డైలాగ్స్ ఉన్నాయి. కేస్ కోసం ఫైట్ చేయాలి, చేసే ప్రతి సారి ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అన్ని దొరికినా, అందులో లూప్ హోల్స్ దొరుకుతాయి, తప్పించుకుంటారు. అన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి, వాళ్ళని ముందుకు తీసుకు రావాలి. అదే అసైన్ మెంట్ వాలి. పెద్ద డైలాగ్ ఉంది, ఎడిట్ రూంలో కి వెళ్ళాక అది మోనిటైజ్ తో కూడిన డైలాగ్ అయింది. అలానే నాకు సింగిల్ టెక్ లెంగ్త్ డైలాగ్స్ ఇష్టం, అవి ఇవ్వు అని శరణ్ కి చెప్పా, నాలుగు పేజీల డైలాగ్ ఉందని చెప్పాడు, హ్యాపీ అనుకున్న అది కాస్త మానిటైజ్ అయింది అని అన్నారు. కానీ అదే కరెక్ట్ అనిపించింది. ఆ విధంగా కొన్ని పోయాయి.

రియల్ స్టొరీ ఇన్సిడెంట్ బేస్ ఏమైనా ఉందా?

రియల్ స్టొరీ బేస్ ఏమికాదు, కానీ గ్యారంటీ ఎవరో ఒకరి లైఫ్ లో జరిగే ఉంటుంది.

సెక్షన్స్ కి సంబంధించిన లూప్స్ ఏమైనా బయటికి తీస్తున్నారా?

సెక్షన్స్ కి సంబంధించిన లూప్స్ బయటికి తీయడం కాదు, ఒక పర్టిక్యులర్ సెక్షన్ వల్ల ఒక వ్యక్తి ఇరుక్కుపోతే, సామాన్యుడికి న్యాయం జరగాలనే ఒక లాయర్ దాన్ని టేకప్ చేసి ఎలా పరిష్కరించాడు. అలా పరిష్కరించే ప్రాసెస్ లో ఎంటేంటి ఎదుర్కున్నాడు. ట్రైలర్ చూసినట్లు అయితే 8 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక మర్డర్ కేస్. ఒక కేస్ ను టేకప్ చేసి, సామాన్యుడి కి న్యాయం చేసే సింపుల్ కేస్ లాయర్ రామచంద్ర ది. కానీ కేస్ మొదలు పెట్టి, తవ్వే కొద్దీ ఒక్కొక్కటి బయట పడుతుంది. కానీ ప్రతి దాంట్లో ఒక లూప్ హోల్ ఉంటుంది. సేవ్ కామన్ మ్యాన్, కామన్ మ్యాన్ నిజం చెబుతున్నాడా, లేదా అవే ఈ చిత్రం లో ట్విస్ట్స్ అండ్ టర్మ్స్.

పాండేమిక్ టైమ్ తర్వత సినిమా థియేటర్ల లో వస్తున్న సినిమా మీదే. ఎలా ఉంది ఆ ఫీలింగ్?

అద్బుతం గా ఉంది. ఓటిటి వాల్యూ పెరిగింది. కానీ మనం అందరం కోరుకునేది థియేటర్ ఎక్స్ పీరియన్స్ కదా, ఉమా మహేశ్వర చిత్రం ఓటిటి కి కాస్త బాధ అనిపించింది. కానీ ఆ టైమ్ లో అదే కరెక్ట్ అనిపించింది. నిర్మాత హ్యాపీ. ఐ రెస్పెక్ట్ ఓటిటి. కానీ నా చిత్రం థియేటర్ల లో చూడటం నాకిష్టం.

మీడియం, బడ్జెట్ సినిమాలు భయపడుతున్నాయి, ఫస్ట్ మూవీ మీది.

నిజం చెప్పాలంటే, మొన్న నాని చెప్పినట్లు థియేటర్స్ నిజంగా సేఫ్. అయితే అందరూ బయట మీట్ అవుతున్నప్పుడు, థియేటర్స్ కి కూడా ఉంటే బావుంటుంది కదా అనిపించింది. ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ఈ పాండమిక్ టైం లో సినిమాలు చేశాను, మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటించాను. సానిటైజ్ చేయడం. అలా అయిదు చిత్రాలు చేశాను. దేవుడు దయ వల్ల నేను సేఫ్.నేను చేయాలా లేదా అనే ఆప్షన్ ఉన్నప్పుడు నేను చేయగలిగా, అలానే ప్రేక్షకులకి కూడా ఆప్షన్ ఇద్దాం అని. అయితే పెద్ద సినిమాలు ఎందుకు రావడం లేదు, మేము ఎందుకు అంటే, మాకు స్పేస్ దొరికింది. మా బడ్జెట్ రేంజ్ కి, కాలిక్యులేశన్ కి సరిపోతుంది. కొంతమందికి వర్కౌట్ అవ్వక పోవచ్చు. వాళ్లకు ఎక్కువ స్పేస్ కావాలేమో, ఎక్కువ థియేటర్లు కావాలేమొ, కానీ మేం వేసుకున్న లెక్కలకు ఇది కరెక్ట్ అనిపించింది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి, హీరోగా చేసి, ఇప్పుడు బిజీ హీరోగా స్టార్ డం వచ్చింది. మీ కెరీర్ ను ఎలా డిస్క్రైబ్ చేస్తారు?

చాలా అద్భుతంగా హై ఉంటుంది. కొన్ని సార్లు వెనక్కి చూసుకోమేమో.సినిమా పై అప్పటి నుండి ఉన్న పిచ్చి ప్రేమ తగ్గలేదు. ఆ బర్నింగ్ డిజైర్ ఎక్కువగా ఉంది. అది వెలుగుతున్నంత కాలం పరిగెడుతూనే ఉంటా.ఇక్కడి నుండి ఇక్కడికి అని రూట్ మ్యాప్ వేస్కోలేదు. అన్ని చేశాను, ఈ స్టెప్ వేస్తే పైకి వెళ్తాను అని అనుకొని చేసిన సినిమాలు చేసి ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీ గా ఉంది. జస్ట్ స్టార్ట్ అయింది.

ఓటిటి అన్ని స్టార్టింగ్ లో మీకే వచ్చాయి. వంకర కథలు కూడా!

వంకర కథలు అన్ని నాకే వచ్చాయి. ఇప్పుడు తిమ్మరుసు చూస్తే మూడు నాలుగేళ్ల వరకూ ఇలాంటి సినిమా రాదు, నేను చేయను. అప్పుడు నాకే బోర్ కొట్టేస్తది. ఆ హై రాకుండా నేను ఏ సినిమా చెయ్యను. ఆ వంకర కథల వల్ల ఆ హై వస్తుంది. ఆ వంకర తనం కథలో ఉండాలి. నా సినిమా చూడటానికి కోరుకునేది ఆ వంకర తనం. ఉమా మహేశ్వర ఇంత పెద్ద మీసం ఉండి, సైడ్ పాపిడ దువ్వి ట్రై చేశా, తర్వాత సినిమాలు కూడా డిఫెరెంట్ గా ట్రై చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిదీ కూడా డిఫెరెంట్ చిత్రం చేస్తున్నా. అలా డిఫెరెంట్ గా చూసుకుంతేనె హై వస్తుంది.

పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అవుతారు?

సింగిల్ షెడ్యూల్ పాలసీ మెయింటైన్ చేస్తున్న, ఒక ఫిల్మ్ ఒక షెడ్యూల్. ఒక సినిమా చేశాక మరొక సినిమా, ఒక షెడ్యూల్ లో 80 పర్సెంట్ పూర్తి అవుతుంది. ముందుగా ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేస్తాం. అలా స్కై ల్యాబ్, గుర్తుందా, ఇలా జంప్ లు చేశా.గాడ్సే లుక్ వేరు. ఇంకా చేయలేదు.

స్కై ల్యాబ్ డాక్టర్ క్యారెక్టర్, గుర్తుందా అల్లరి చిల్లర క్యారెక్టర్ కాలేజీ కుర్రాడి క్యారెక్టర్. అయితే సింగిల్ షెడ్యూల్ లో చేయడం వల్ల క్యారెక్టర్ లో ఉండొచ్చు. ప్రొడ్యూసర్ హ్యాపీ. డైరెక్టర్ హ్యాపీ నేను హ్యాపీ.ఇలా చేయడం వల్లనే నేను ఇక ఫైవ్ ఫిల్మ్స్ చేయగలిగాను.

ఈ ప్లేస్ కి వస్తారని ఎప్పుడైనా ఊహించారా?

అది సమాధానం ఇస్తుంటే మధ్యలో కెలికావ్.

ఉమా మహేశ్వర రావు మిమ్మల్ని తిప్పేసింది గా?

గ్యారంటీ అండి. ఎక్కడో, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ అవ్వడం వల్ల, దానికి నేను సూట్ అవుతా అని ఊహించడం వలన. అయితే మిస్టర్ పర్ఫెక్ట్ తో స్టార్ట్ అయి, ఉమా మహేశ్వర తో ఎండ్ అయింది.

ఉమా మహేశ్వర థియేటర్ల లో రిలీజ్ అయి ఉంటే సూపర్ స్టార్ అయ్యేవాడు అని నాని అన్నట్లు, మీరేమైనా ఫీల్ అయ్యారా?

చాలా అనుకున్నాం, కానీ పీక్స్ టైమ్ కదా,మహా, శోభు వేసుకున్న కాలిక్యులేశన్ కి తగ్గట్లు గా ఆ టైం లో నెట్ ఫ్లిక్స్ కి ఇవ్వడం జరిగింది. ఎంతో పేరు వచ్చింది.

ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎలా ఉంది ఆ ఫీలింగ్?

తారక్ అన్న రిలీజ్ చేసిన ఆ ట్రైలర్ ఫైవ్ మిలియన్స్ వచ్చింది. ఆ క్రెడిట్ అంతా తారక్ అన్నదే. జనాల్లోకి అలా వెళ్ళింది అంటే తారక్ అన్న వల్లనే. అది తన పవర్. అడగ్గానే ఒప్పుకోవడం, చాలా సేపు మాట్లాడుకున్నాం, సినిమా చూస్తా అని కూడా చెప్పారు. చాలా స్టార్ డం ఉన్న తారక్ వల్ల ఈ చిత్రం గురించి అందరికీ తెలిసింది. ఆ క్రెడిట్ తారక్ దే.

థాంక్స్ టు హిమ్.

మీ టైమ్ స్టార్ట్ అయింది అని అనుకోవచ్చా?

అనుకోవచ్చు. న్యూ ఏజ్ టైమ్, చివరి 3-4 సంవత్సారాలు నుండి చూసుకుంటే, కొత్తగా ట్రై చేసిన ప్రతి సినిమా ఆడుతుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నా, తెలుగు సినీ పరిశ్రమ ఒక కర్వ్ తీసుకుంటుంది.

డిఫరెంట్ స్టోరీస్ తో ముందుకు వెళ్ళేవారు ఒరిజినల్ స్టోరీస్ తొ ముందుకు వెళ్తారు.

అదేమీ లేదు, నేను ఇష్టపడుతున్నా గా,రీమేక్ చేయాలనే ఉద్దేశ్యం కాదు. అనుకోకుండా జరిగిన ఒక సీక్వెన్స్.ఉమా మహేశ్వర తర్వాత ఇది రావడం వల్ల, అనుకొని చేసిన చిత్రం కాదు, మధ్య లో స్కై ల్యాబ్ ఉంది, గాడ్సే ఉంది. కథ బావుంది అనే ఉద్దేశ్యం తో చేసిన చిత్రం ఇది. అయితే జ్యోతి లక్ష్మీ నుండి ఈరోజు వరకూ 120 కథలు విన్నాను, కానీ చేసింది 10 కథలు. నచ్చితే కథ చేసేస్తాను. కథ కోసం వెయిట్ చేయాలి అనుకున్నప్పుడు, దొరికిన ఒక మంచి కథ చేయడం జరిగింది. మున్ముందు ఇలా చేయనేమో.

రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు రెండు మూడు సార్లు చిత్రాన్ని చూస్తారు.

చూడను.

సినిమా మైండ్ లో ఉంటాదా?

కథ ఉంటుంది.

హీరో అయ్యాక ఇంకా వేరే సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేయడం

అదే నమ్మాం,నచ్చిన దానిలో చేయడం మజా ఉంటది. నెక్స్ట్ చేస్తున్నవి అన్నీ హీరో పాత్రలే. ఈ మధ్యలో వేరే చేయలేను.నన్ను నమ్ముకొని డబ్బు పెట్టే వారికి న్యాయం చేయాలి.

లాయర్ రామచంద్ర వ్యూహాలు వేస్తూ కామన్ మ్యాన్ కి న్యాయం చేయడం ఈ సినిమా.

దేవీ 70 ఎంఎం వద్ద ఒక పిక్ తీసుకున్నారు. ఎలా ఉంది ఆ కిక్?

మామూలుగా లేదు.

హీరోయిన్ క్యారెక్టర్ గురించి?

ప్రియాంక గారు నా టీమ్. ప్రియాంక, బ్రహ్మాజీ, నేను ముగ్గురం లాయర్స్. ఒకే కంపనీ కి పని చేస్తాం. హీరోయిన్ నాకు ఒక సపోర్ట్ సిస్టం. మేము ముగ్గురం కలిసి ట్రావెల్ అవుతూ ఉంటాం. మంచి నటి. టాక్సివాలా ఇప్పుడు ఇది, ఎస్ ఆర్ కళ్యాణమండపం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు