ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : అనిల్‌ రావిపూడి – డైరెక్టర్ గా సక్సెస్ కి.. అదే నా సీక్రెట్.

Published on Jan 13, 2020 5:41 pm IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కా బాప్ అనే టాక్‌ తో తొలి రోజున వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 46.77 కోట్లరూపాయ‌ల షేర్‌ను సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ క‌లెక్షన్స్‌ ను సాధిస్తూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా అనిల్‌ రావిపూడి 123తెలుగు.కామ్ కి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

ఓవరాల్ గా సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?

అద్భుతమైన రెస్పాన్స్.. ఓపెనింగ్ డే అదిరిపోయింది. నిన్న, ఈ రోజూ కూడా కలెక్షన్స్ స్టడీగా వస్తున్నాయి. అన్ని చోట్ల నుండి అలాగే అన్ని వర్గాల ప్రేక్షుకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చాల హ్యాపీగా ఉన్నాం.

 

ఇండస్ట్రీ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఉంది, ఎవరెవరు నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎటువంటి అభినందనలు అనుకున్నారు ?

మార్నింగ్ షో పడగానే నా వెల్ విషెర్స్ అందరూ కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. పూరిగారు మెసేజ్ చేశారు. రాఘవేంద్రరావుగారు మెసేజ్ చేశారు. అన్నిటికిమించి ప్రేక్షుకులందరూ సినిమా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాలోని ప్రతి ఎపిసోడ్ గురించి పిన్ పాయింట్ చేసుకుని మెసేజ్ చేస్తున్నారు. అది ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తోంది.

 

ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ మీరందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ?

బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సినిమాలోని హైలైట్స్.. హీరోగారి మేనరిజమ్స్ కావొచ్చు, మైండ్ బ్లాంక్ సాంగ్ కావొచ్చు, ఫన్ కావొచ్చు.. ఇలా హైలైట్స్ అన్నిటినీ ఆడియన్స్ అందరూ అద్భుతంగా ఉన్నాయని, చాల డిటైల్డ్ గా మెసేజ్ చేస్తున్నారు. ఇవే బెస్ట్ కాంప్లిమెంట్.

 

ఫస్ట్ డే 40 కోట్లు ప్లస్ షేర్ వచ్చింది. ఈ రేంజ్ ఓపెనింగ్స్ ను మీరు ముందే ఎక్స్ పెక్ట్ చేశారా ?

ఫస్ట్ డే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వస్తాయి.. చాల పెద్ద నెంబరే వస్తోందనుకున్నాం. కానీ, చాల మంచి నెంబర్ 40 కోట్ల ప్లస్ వచ్చింది. కలెక్షన్స్ కూడా స్టడీగా ఉన్నాయి. ఇంకా పండుగ మొదలవ్వలేదు కాబట్టి మరో వారం వరకూ ఫుల్ కలెక్షన్స్ ఉంటాయి.

 

సినిమా అంతా చాల బాగా వచ్చింది. కానీ క్లైమాక్స్ లో ఇంకొంచెం యాక్షన్ పార్ట్ బెటర్ గా ఉండి ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ వచ్చింది ?

ఫస్ట్ డే చాలమంది ఇలాగే ఫీల్ అయినమాట నిజమే కానీ, అది సెకెండ్ డేకి అలా ఎవ్వరు ఫీల్ అవ్వలేదు. సినిమా మళ్లీ చూశాక క్లైమాక్స్ లో ఉన్న కొత్త థాట్ అందరికీ అర్ధం అయింది. ఇప్పుడు చాల మంది ఆడియన్స్ కు క్లైమాక్స్ చాల బాగా నచ్చుతుంది. అదే, రెగ్యూలర్ గా యాక్షన్ పార్ట్ పెట్టి ఉంటే క్లైమాక్స్ వెరీ రొటీన్ గా ఉండేది. ఏదైనా కొత్తగా చేసినప్పుడు రిసీవ్ చేసుకోవటానికి కొంత టైం పడుతుంది.

 

మీ ప్రతి సినిమాలో మాడ్యులేషన్స్, మేనరిజమ్స్.. చాల డిఫరెంట్ గా చాల ఫన్నీగా ఉంటాయి. వాటి కోసం ఏమైనా ప్రత్యేకంగా రీసెర్చ్ చేస్తారా?

రీసెర్చ్ లాంటిది ఏమి లేదండి. కథను బట్టి కథలోని క్యారెక్టరైజేషన్స్ ను బట్టి ఆ సినిమాలో ఏమి చేస్తే బాగుంటుందని ఆలోచించి రాసుకోవటమే తప్ప మాడ్యులేషన్స్, మేనరిజమ్స్ ఇలా ఉండాలని ముందే రాసుకోను.

 

చాల తక్కువ టైంలో ఇంత పెద్ద సినిమా ఎలా రాశారు ? ఎలా తీయగలిగారు ?

నాకు స్క్రిప్ట్ కు నాలుగు నెలలు టైం సరిపోతుంది. ప్రతి సినిమాకి నేను అంతే టైం తీసుకుంటాను. ఇక షూటింగ్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా షూట్ చేశాము. అందుకే షూటింగ్ పార్ట్ చాల తొందరగా అయిపొయింది.

 

ఈ జనరేషన్ లో మీరు బెస్ట్ కామెడీ డైరెక్టర్. మరి బెస్ట్ కామెడీ కోసం మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారు?

హోమ్ వర్క్ అంటే.. చిన్నప్పటి నుండి నేను చూసిన సినిమాలే నాకు ప్రేరణ. ఇక కామెడీ ఎలా రాయాలి అనే విషయం నాకూ తెలియదు. నాకు అనిపించిందే నేను రాస్తాను. అది బాగా వర్కౌట్ అవుతుంది.

 

మీ పై జంధ్యాలగారి ప్రభావం చాలమంది ఉంది. ఓన్లీ ఆయన ప్రభావమేనా లేక కామిక్ బుక్స్ కూడా చదువుతారా ?

సినిమాలే నాకు బుక్స్ అండి. సినిమాలు చూడటం తప్ప నేను పెద్దగా బుక్స్ చదవను. నేను నేర్చుకున్న ఏదైనా సినిమాల నుండే నేర్చుకున్నాను. నా సీనియర్ డైరెక్టర్స్ తీసిన సినిమాలే నా మైండ్ కి ఎక్కి నాకూ అంటూ ఒక టైమింగ్ వచ్చింది.

 

మీ ప్రతి సినిమాలో దేశ భక్తి ఎలిమెంట్స్ ప్రత్యేకంగా ఎలివేట్ చేస్తారు. అది కమర్షియల్ యాంగిల్ దృష్టిలో పెట్టుకోనా ? లేక మీ పర్సనల్ ఇంట్రస్ట్ నా?

సోషల్ థింగ్స్ ఫాలో అవుతుంటాను. వాటిలో నాకు కనెక్ట్ అయినది.. నా స్క్రిప్ట్ లో సూట్ అయ్యేది ఏదైనా ఉంటే దాన్ని సినిమాలో పెడతాను. ఇది నా పర్సనల్ ఇంట్రస్టే.

 

మీరు నుండి భవిష్యత్తులో ఓన్లీ సెంటిమెంటల్ ఫిల్మ్ గాని, డిఫరెంట్ జోనర్ లో గాని సినిమాని ఆశించొచ్చా?

చేస్తాను, అన్ని జోనర్స్ లో సినిమాలు చేస్తాను, ఇప్పుడే కదా జర్నీ మొదలైంది. ఇంకా చాల లాంగ్ జర్నీ ఉంది. అప్పుడే జనాన్ని మార్చాలనుకుంటే.. (నవ్వుతూ) వాళ్ళు కూడా ఇది అవుతారు.

 

మీరు బాలయ్యతో ‘రామారావుగారు’ అనే సినిమాని చేద్దామనుకున్నారు. ఆ సినిమా చేసే ఆలోచన ఉందా ?

చేస్తాను, టైం చూసుకుని చెయ్యాలి. అయితే ఎప్పుడు కుదిరిద్దో చూడాలి.

 

కళ్యాణ్ రామ్ గారు మిమల్ని డైరెక్టర్ ని చేశారు. ఆయనతో మళ్లీ సినిమా చేస్తారా ?

ఎందుకు చెయ్యను, కథ కుదిరితే తప్పకుండా చేస్తాను.

 

కామెడీ మూవీస్ చేయాలనుకునే అప్ కమింగ్ డైరెక్టర్స్ కి మీరిచ్చే సలహాలు అండ్ టిప్స్ ఏమిటి ?

టిప్స్ అంటే ఏమి లేవు. (నవ్వుతూ) ఈ జనరేషన్ మనకంటే షార్ప్ గా ఉన్నారు. వాళ్ళు మన సినిమానే జడ్జ్ చేస్తారు కాబట్టి వాళ్ళకంటూ ఓకే క్లారిటీ ఉంది. కొత్తగా వచ్చే వాళ్లకు మనం ఏమి చెప్పక్కర్లేదు.

 

మీరు రైటర్ గా చాల సినిమాలు చేశారు, అయితే రైటర్ గా మీకు పెద్దగా స్టార్ డమ్ రాలేదు. కానీ, డైరెక్టర్ గా చాల తక్కువ టైంలోనే టాప్ స్టార్ డైరెక్టర్స్ గా ఒకరిగా ఎదిగారు. రైటర్ గా రాని స్టార్ డమ్ డైరెక్టర్ గా ఎలా వచ్చింది ?

డైరెక్టర్ కి రైటర్ కి చాల తేడా ఉంటుంది. రైటర్ అనేవాడు డైరెక్టర్ ను బట్టే పని చేయాలి. రైటర్ తాలూకు పూర్తి వర్క్ డైరెక్టర్ తీసుకోకపోవచ్చు. అదే రైటర్ డైరెక్టర్ ఒక్కరే అయితే అతను ఏమి అనుకుంటున్నాడో దేన్నీ అయితే నమ్ముతున్నాడో దానికి పూర్తి న్యాయం చెయ్యొచ్చు. అప్పుడు బెటర్ అవుట్ ఫుట్ వస్తోంది. డైరెక్టర్ గా సక్సెస్ కి అదే నా సీక్రెట్.

 

మీ తదుపరి సినిమాని ఎవరితో చేస్తున్నారు ? ఎలా ప్లాన్ చేస్తున్నారు ?

ఇంకా ఏమి అనుకోలేదు. పది రోజుల వరకూ తరువాత సినిమా గురించి ఆలోచించను.

సంబంధిత సమాచారం :