ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : సుధీర్ బాబు – నేను ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోదాం అనుకోలేదు

Published on Sep 2, 2020 7:30 pm IST

 

లేటెస్ట్ గా డిజిటల్ గా విడుదలకు రెడీ అవుతున్న మన టాలీవుడ్ చిత్రం “వి”. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నానితో పాటుగా హీరో సుధీర్ బాబు కూడా ఒక మెయిన్ లీడ్ లో నటించారు. మరి ఇప్పుడు ఆయనతో లేటెస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాం, మరి సుధీర్ బాబు ఎలాంటి ఆసక్తికర విషయాలను తెలిపారో ఓ లుక్కేద్దాం..

 

“వి” ఎలా ఉంటుంది?

మా ఈ “వి” ఫిల్మ్ రాక్షసుడు, రక్షకుడు అనే ఇద్దరి మధ్య నడిచే యాక్షన్ ఎంటర్టైనర్, ఇందులో నేను రక్షకునిగా కనిపిస్తా. ఈ రెండు రోల్స్ లో వారు అనుకున్న దాని కోసం ఎంత దూరం అయినా వెళ్తాయి.

 

ఇంద్రగంటి మీరు రోల్ చెప్పినపుడు మీ రెస్పాన్స్?

ఒక రక్షకునిగా నా రోల్ కోసం ఇంద్రగంటి గారు చెప్పినప్పుడే ఈ రోల్ చాలా నచ్చేసింది. అలాగే ఇలాంటి రోల్ ఇంతకు ముందు చేయనిది, అందుకే ఈ రోల్ కోసం నానా బెస్ట్ నే ఇచ్చాను. ఒక పర్ఫెక్ట్ మల్టీ స్టారర్ కు ఈ రోల్ సరిగ్గా సెట్ అవుతుంది.

 

ఈ రోల్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?

ఇంద్రగంటి గారు నన్ను ఫైట్ క్లబ్ లోని బ్రాడ్ పిట్ లా కనిపించాలని చెప్పారు. అందుకు నేను చాలా ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. యాక్షన్ సీన్స్ లో అయితే కాలికి దెబ్బ కూడా తగిలింది. నా రోల్ నుంచి ఫైట్స్ కూడా సాలిడ్ గా ఉంటాయి.

 

ఇంద్రగంటి గారితో పని ఎలా అనిపించింది?

ఆయనతో పని చేస్తే నాకు మళ్ళీ స్కూల్ కి వెళ్లినట్టు అనిపించింది. ఆయనతో పని చేస్తే కేవలం ఎలా నటించాలో అన్నది మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా మార్పు వస్తుంది. సెట్స్ లో ఉన్నంతసేపు ప్రశాంతంగా, చాలా కూల్ గా పనిచేస్తూ వెళ్ళిపోయేవారు. కానీ ఆయనతో వర్క్ ఎలా ఉంటుందో రేపు వి విడుదలయ్యాక తెలుస్తుంది.

 

నానితో వర్కింగ్ ఎక్స్ పీరెన్స్ ఎలా ఉంది?

మేమిద్దరం కథ పరంగా ఈ చిత్రాన్ని ఒప్పుకున్నాం. మాకు ఇన్ని సీన్లు ఉండాలి అలా ఉండాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నాని మొదటిసారి చేసిన ఈ నెగిటివ్ రోల్ ఖచ్చితంగా ప్రతీ ఒక్కరిని షాక్ కు గురి చేస్తుంది.

 

ఓటిటిలో విడుదలని మీరు ఏమన్నా నిరాశగా ఉన్నారా?

నిజానికి అవును, ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలి అనుకున్నాం. కానీ అమెజాన్ వారు ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. దాదాపు మొత్తం 200 దేశాల్లో వి రిలీజ్ అవుతుంది. ఇది మా టీం అంతటికీ చాలా చాలా పెద్ద రిలీజ్.

 

మీ రోల్ కోసం ఏమన్నా.?

రియల్ లైఫ్ లో సాఫీగా తన జీవితాన్ని సాగించే స్టైలిష్ బాగా గుర్తింపు ఉండే పోలీస్ రోల్ లో కనిపిస్తాను. అలాంటి పోలీస్ జీవితంలోకి ఒక పర్సనల్ మిషన్ తో ఉన్న వచ్చిన వ్యక్తి వల్ల వచ్చిన ఛాలెంజ్ ను ఎలా పేస్ చేస్తాడు అన్నది అసలు విషయం.

 

స్టోరీ సెలక్షన్ లో ఎవరు హెల్ప్ కానీ?అలాగే మీకు చాలా మంది సరైన గుర్తింపు రాలేదు అనుకుంటారు దానికి మీ సమాధానం?

నాకు ఉన్న కొంతమంది స్నేహితులు అలాగే నాకు అండగా ఉన్నవారిని అడిగినా కానీ చివరి నిర్ణయం మాత్రం నాదే. ఎందుకంటే స్క్రీన్ పై నేనే కనిపించాలి. అందుకే కొన్ని కఠిన సమయాల్లో కూడా నా నిర్ణయాన్ని నేనే తీసుకుంటాను. ఇక నా గుర్తింపు అనే దానికి వస్తే నేనేమి ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోవాలని రాలేదు. నాకు సినిమాలు అంటే ఇష్టం నాకు సాధ్యమైనంత వరకు నా బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నిస్తాను. ఇక మిగతా అంతా నన్ను ఎంచుకొనే దర్శకులు ఆధార పడి ఉంది. నేనొక వెర్సిటైల్ యాక్టర్ గా నిలవాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒకరోజు నేను అనుకున్నది సాధిస్తాను.

 

హిందీలో “భాగీ” సాలిడ్ హిట్ అయ్యాక మళ్ళీ అక్కడ ఎందుకు కొనసాగలేదు?

భాగీ తర్వాత హిందీ సినిమాలో కూడా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను తెలుగులో అప్పటికే పలు ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం వల్ల కుదరలేదు. రాబోయే రోజుల్లో హిందీలో కూడా ఖచ్చితంగా నటిస్తాను.

 

రాబోయ్ ప్రాజెక్ట్స్ కోసం ఏమన్నా చెప్తారా?

ఈ లాక్ డౌన్ సమయంలో చాలా సమయం ఇంట్లోనే ఫామిలీతో ఉన్నాను. ఈ గ్యాప్ రెండు రోజులకో కథ విన్నాను. కానీ ఫైనల్ రెండు ప్రాజెక్ట్స్ మాత్రమే సైన్ చేశాను. అవి మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నాం.

 

చివరిగా “వి” పై మహేష్ రియాక్షన్ ఏంటి?

మొదటి రోజు నుంచి మహేష్ ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. అలాగే ఇంద్రగంటిపై కానీ అతని సినిమాల పై కానీ చాలా నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రం కోసం చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనని మహేష్ నమ్మకం.

సంబంధిత సమాచారం :

More