ఇంటర్వ్యూ : నిర్మాత సాహు గారపాటి – “టక్ జగదీష్” చూసాక ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలి అనుకుంటారు

Published on Sep 4, 2021 5:02 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “టక్ జగదీష్”. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం పలు కారణాల చేత థియేట్రికల్ రిలీజ్ ని స్కిప్ చేసి నేరుగా ఓటిటిలో రిలీజ్ అవుతుంది. మరి ఈ సందర్భాన ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర నిర్మాత సాహు గారపాటి ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి అందులో ఈ సినిమా పై ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం..

చెప్పండి ‘టక్ జగదీష్’ ఎలా స్టార్ట్ అయ్యింది?

మజిలీ సినిమా తీసాక దానికన్నా ఎక్కువ స్కేల్ లో మరో స్టార్ హీరోతో పెద్ద సినిమా తియ్యాలి అనుకున్నాం అప్పుడు వచ్చిందే ఈ “టక్ జగదీష్”. డైరెక్టర్ శివ కోసం తెలిసిందే. చాలా ఎమోషనల్ తను అలానే లాస్ట్ సినిమాలు కూడా ఉంటాయి దీనిని కూడా అంతకు మించిన ఎమోషన్స్ తోనే ఉంటుంది. అలా నాని అయితే ఇలాంటి రోల్ కి కరెక్ట్ అనిపించి వెళ్లి చెప్పగానే ఓకే చేశారు. చాలా కాలం నుంచి సినిమాల్లో మంచి ఎమోషన్స్ మిస్సవుతున్నాయి వాటన్నిటినీ టక్ జగదీష్ తీరుస్తుంది. ఈ సినిమా చూసాక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలిరా అని ఖచ్చితంగా అనుకుంటారు.

ట్రైలర్ లో సినిమా కథ పెద్దదిలా ఉంది, రెండు పార్ట్స్ గా చెయ్యాలి అనిపించలేదా?

అలా ఏమి ఉండదు కథ పెద్దదే మంచి ఎమోషన్స్ ఉంటాయి. సెకండాఫ్ లో అయితే అలా డ్రైవ్ అవుతూ ఉంటుంది. కానీ సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలే అందుకే రెండు భాగాలుగా అక్కర్లేకుండా ఇది సరిపోతుంది.

ముందు సినిమాని థియేటర్స్ కే అనుకున్నారు ఇప్పుడు ఓటిటిలో వస్తుంది దీనిపై చెప్పండి

మేము ముందు నుంచి కూడా సినిమా థియేటర్స్ లో రిలీజ్ చెయ్యాలనే చాలా కాలం పాటు హోల్డ్ చేసి ఉంచాం. కానీ అనుకోకుండా కరోనా ఎంటర్ కావడంతో అంతా మారిపోయింది. దీనితో ఏప్రిల్ లో అనుకున్నాం కానీ అప్పుడు రెండో వేవ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి, మూడో వేవ్ వస్తుంది అంటున్నారు మరి ఇంకా మేము ఎంత కాలం హోల్డ్ చేసి ఎగ్జైట్మెంట్ ని ఉంచుతాం అందుకే ఇక ఇలా తీసుకువస్తున్నాం.

నాని సినిమాలు అంటే మంచి ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్ కానీ అవేవి ట్రైలర్ లో కనిపించట్లేదు?

ఇందులో ఎక్కడా ఎంటర్టైన్మెంట్ లేదు అని కాదు అది కూడా ఉంది కానీ ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపిస్తాయి. అంటే కంటెంట్ మేజర్ గా ఎమోషన్ ఆధారంగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఉంటుంది అలాగే కామెడీ కూడా ఉండాల్సినంత ఉంటుంది.

మీది కొత్త బ్యానర్ మరి స్టార్టింగ్ లోనే ఓటిటికి ఇస్తున్నారు అని అటాక్ కూడా ఉంది దీనిపై ఏమంటారు?

ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లెమ్స్ వాళ్లకి ఉన్నాయి, వారి సైడ్ ఉండాల్సిన సమస్యలు వాళ్లకి ఉంటే నిర్మాతలుగా మా వైపు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని వారు అర్ధం చేసుకుంటారు అనే మేము అంతలా రెస్పాండ్ కాలేదు. మేము తీసుకున్న నిర్ణయంపై కూడా ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది.

‘S R కళ్యాణమండపం’ తర్వాత బానే అనిపించింది మరి అప్పుడు రిలీజ్ పై ఏమి అనిపించలేదా?

అవును ఆ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ తర్వాత మేము కూడా అనుకున్నాం థియేటర్స్ లోనే రిలీజ్ చేద్దామని, ఈ 12న కూడా ఇంకా కొన్ని డేట్స్ అనుకున్నాం కానీ ఇంకా చాలా చోట్ల థియేటర్స్ తెరుచుకోవాల్సి ఉంది, ముందు రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీక ఓటిటికే ఎంచుకున్నాం.

ప్రొడ్యూసర్ గా ఈ హీరోతో చెయ్యాలి అనేమన్నా ఉందా?

అలా ఏమి లేదు కానీ నాని గారితో సినిమా చెయ్యడం ఇష్టపడతాను నేను. ఇంకా ఒక ప్రొడ్యూసర్ అన్నాక అందరి హీరోలతోని సినిమా చెయ్యాలనే అనుకుంటాడు తప్పితే మరొకటి ఉండదు మేము అందరి హీరోస్ తోని చెయ్యాలనే అనుకుంటాం.

సినిమాకి మ్యూజిక్ థమన్ ఇచ్చాడు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారింది కారణం?

బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా థమన్ నే ఇవ్వాల్సి ఉంది కానీ గతంలో శివ కి గోపి సుందర్ కి రెండు సినిమాలు చెయ్యడం మూలాన మంచి బాండింగ్ ఉంది కాకపోతే మజిలీ సినిమాకి గోపి సుందర్ అందుబాటులో లేక చెయ్యడం కుదరలేదు అప్పుడు దానికి థమన్ చేసాడు. ఇప్పుడు ఈ సినిమాకి ఇందులో మెయిన్ ఫ్యామిలీ ఎమోషన్ ఎక్కువ ఉంది దానికి గోపి సుందర్ న్యాయం చెయ్యగలడు శివ ఎమోషన్ ని బాగా అర్ధం చేసుకుంటాడు కదా అని అలా గోపి సుందర్ తో చేయించాం.

మరి ఈ సినిమా తర్వాత థియేటర్లో కూడా రిలీజ్ చేస్తారా?

అలా ఛాన్స్ ఉంది మాట్లాడాలి అనుకుంటున్నాం ఎందుకంటే లాస్ట్ టైం నాని గారిది ‘వి’ రిలీజ్ అయ్యింది. అలాగే వీలయితే మళ్ళీ ఓటిటి తర్వాత థియేటర్స్ లో కూడా రిలీజ్ చేస్తాం.

మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎవరెవరితో ఉన్నాయి?

బాలకృష్ణ, అనీల్ రావిపూడి గార్లతో ఒకటి ఉంది దానిపై దసరాకి అనౌన్సమెంట్ ఉంది. ఇంకా నాగ చైతన్య గారితో ఓ సినిమా దానిపై కూడా త్వరలోనే అనౌన్సమెంట్ వస్తుంది. విజయ్ దేవరకొండ తో ప్రాజెక్ట్ ఇంకా టైం పట్టొచ్చు.

సంబంధిత సమాచారం :