ఇంటర్వ్యూ : మెహ్రీన్ – `అశ్వ‌థ్థామ‌` ఒక ఎమోషనల్ థ్రిల్లర్ !

Published on Jan 27, 2020 5:20 pm IST

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందించిన చిత్రం `అశ్వ‌థ్థామ‌`. కాగా ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. కాగా ఈ సందర్భంగా మెహ్రీన్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

`అశ్వ‌థ్థామ‌’ గురించి చెప్పండి ?

`అశ్వ‌థ్థామ‌’ అమ్మాయిల పట్ల సమాజంలో జరుగుతున్న ఓ రాంగ్ ఇష్యూను చాల ఎమోషనల్ గా ఎదురుకుని న్యాయం చేసే కోణంలో సాగే సినిమా. ఇది ఒక నిజాయితీ గల కథ.

 

సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది. హీరో క్యారెక్టర్ కు సపోర్ట్ గా ఉంటుందా ?

యస్.. హీరో క్యారెక్టర్ తో లవ్ లో పడి, చాల పోసిస్సివ్ లవర్ గా ఫీల్ అయ్యే క్యారెక్టర్ లో నేను ఈ సినిమాలో కనిపిస్తాను. నా క్యారెక్టర్ కూడా చాల బాగా వచ్చింది.

 

లేడీస్ పై జరుగుతున్న దాడులు రోజూ వింటూ ఉన్నాం. ఈ సినిమాని కూడా అదే పాయింట్ ఆధారంగా తీశారు. ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తోంది ?

అలాంటివి జరిగాయి అని విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఏ అమ్మాయి విషయంలో అలా జరగకూడదు అని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. బాధ్యతగా ఉండాలి.

 

సినిమా ఫస్ట్ కాపీ రెడీ ఆయి ఉంటుంది. మరి మీరు సినిమా చూశారా ?

ఇంకా నేను సినిమా చూడాలేదండి. వరుసగా షూటింగ్ తో సరిపోతుంది. బట్ సినిమా అవుట్ ఫుట్ అయితే అద్భుతంగా వచ్చింది. సినిమా ఎప్పుడు ఎప్పుడు చూడాలా అని నేను కూడా చాల ఆసక్తిగా ఉన్నాను.

 

ఈ సినిమాలో కామెడీ ఎలా ఉండబోతుంది ?

ఈ సినిమాలో కామెడీ కంటే కూడా ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. అయినా లైఫ్ అనేది కామెడీ కాదు కదా, లైఫ్ చాల సీరియస్ అండ్ చాల ఎమోషన్.. అదే ఈ సినిమాలో ఉంటుంది. ప్రతి సీన్ లో ఏమి జరుగుతుంది అనే ఇంట్రస్ట్ ఉంటుంది. ఒక్క మాటలో `అశ్వ‌థ్థామ‌’ ఎమోషనల్ సాగే థ్రిల్లర్.

 

మరి సినిమాలో లవ్ ట్రాక్ ఎలా ఉంటుంది ?

లవ్ స్టోరీ ఇంట్రస్ట్ గా ఉంటుంది. ఓపెనింగ్ సీక్వెన్సే చాల బాగుంటుంది. లవ్ ట్రాక్ కూడా అందరికీ నచ్చుతుంది.

 

టీజర్ ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. మీరు ముందే ఊహించారా ?

సినిమా ఎలా ఉండబోతుంది, సినిమాలో మెయిన్ కంటెంట్ ఏమిటో ట్రైలర్ లోనే చెప్పడం జరిగింది. అదే అందరికీ బాగా కనెక్ట్ అయింది.

 

నాగశౌర్యతో కలిసి పని చేయడం ఎలా అనిపించింది. ఆయన గురించి ?

నాగశౌర్య వెరీ హార్డ్ వర్కింగ్.. మల్టీ టాలెంటెడ్ పర్సన్. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో. చాల స్వీట్ పర్సన్.. వెరీ హానెస్ట్.. చాల సింపుల్ గా ఉంటారు. కో యాక్టర్స్ కు బాగా సపోర్ట్ చేస్తారు. తనతో పనిచేయడం చాల అనందంగా ఉంది.

 

ఈ నెలలో మీరు నటించిన ‘ఎంత మంచివాడవురా’ విడుదలైంది. 31న ‘అశ్వథ్ధామ’ విడుదలకు కాబోతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు ?

నేను చేసిన సినిమాల విషయంలో నేను పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ‘ఎంత మంచివాడవురా’కి కూడా నాకు మంచి పేరు వచ్చింది. జనవరి 31న మా ‘అశ్వథ్ధామ’ విడుదల కాబోతుంది. ఖచ్చితంగా ఈ సినిమాలో కంటెంట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.

సంబంధిత సమాచారం :