ఇంటర్వ్యూ : నిర్మాత సుధాకర్ చెరుకూరి – ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు!

ఇంటర్వ్యూ : నిర్మాత సుధాకర్ చెరుకూరి – ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ని ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు!

Published on Jan 19, 2026 8:37 PM IST

Sudhakar Cherukuri

మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ రెస్పా్న్స్ అందుకుంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 13న రిలీజ్ అయిన ఈ సినిమా చక్కటి విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ షోలతో రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్రేక్ ఈవెన్ అయింది కదా.. హ్యాపీగా ఉన్నారా?

చాలా హ్యాపీ. ఆంధ్రాలో మొత్తం ఆల్మోస్ట్ అయింది. ఇది లాంగ్ వీకెండ్. సోమవారం కూడా హాలిడే. నైజంతో పాటు మిగతా ఏరియాల్లో కూడా అయిపోతాయి. ఆడియన్స్ నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ కూడా చాలా హ్యాపీగా ఉండటం మాకు ఎంతో ఆనందం ఇచ్చింది.

పండగకి వచ్చిన అన్ని సినిమాలు కూడా విజయాలు సాధించాయి కదా.. ఎలా అనిపిస్తుంది?

అరుదైన గొప్ప విషయం ఇది. వచ్చిన ఐదు సినిమాలు కూడా అద్భుతంగా ఆడాయి. సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా ఫస్ట్ ఆప్షన్. అందరూ ఆ సినిమాని చూసేశారు. ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి మిగతా సినిమాలన్నీ కూడా రన్ అద్భుతంగా ఉండబోతుంది. రెండో మూడో వారాలు కూడా చాలా మంచి రన్ ఉంటుంది.

రవితేజ గారితో సినిమా చేయడం ఎలా అనిపించింది?

ఆయనతో పని చేయడం ఇది రెండోసారి. మేము మొదటిది అనుకున్నంతగా రాలేదు. ఇది మాత్రం మేము ఏదైతే అనుకున్నామో అన్ని ఎలిమెంట్స్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు మంచి రెస్పాన్స్ అందిస్తున్నారు.

చిరంజీవి గారి సినిమా ఎప్పుడు?

ప్యారడైజ్ అయిపోయిన వెంటనే అది మొదలుపెడతాం. అది పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ కథ.

మీ డ్రీమ్ ప్రాజెక్ట్?

ఇండస్ట్రీలో అందరూ గొప్పగా చెప్పుకునే సినిమా ఒకటి తీయాలని ఉంటుంది. ఆ కల పారడైజ్ తో తీరిపోతుందని నమ్మకం ఉంది. పారడైజ్ 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమాని దాదాపు అన్నీ సెట్స్ లో షూట్ చేస్తున్నాం. సినిమా అద్భుతంగా వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు