ఇంటర్వ్యూ : నిర్మాత రిజ్వాన్ – ‘సుందరి’ లో డైలాగ్స్ తక్కువ కానీ ఎమోషన్స్ చాలా బాగుంటాయ్

ఇంటర్వ్యూ : నిర్మాత రిజ్వాన్ – ‘సుందరి’ లో డైలాగ్స్ తక్కువ కానీ ఎమోషన్స్ చాలా బాగుంటాయ్

Published on Aug 8, 2021 1:35 PM IST

ప్రముఖ నటి పూర్ణ ప్రధాన పాత్రలో కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “సుందరి” ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం నిర్మాత రిజ్వాన్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి అందులో ఎలాంటి విశేషాలు తెలిపారో చూద్దాం రండి..

చెప్పండి మీ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు జర్నీ ఎలా ఉంది?

మూవీ ఫీల్డ్ లో నా జర్నీ చాలా బాగుంది అందరు హెల్ప్ చేసే వాళ్ళే ఉన్నారు తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇక సుందరి సినిమాని అయితే ముందు నార్మల్ గానే తీద్దాం అనుకున్నాను కానీ సినిమా ఇంత బాగా వస్తుంది అనుకోలేదు.. పూర్ణ గారు యాడ్ అయ్యాక ఇంకా బాగా వచ్చింది ఈ సినిమా.. సెన్సార్ అన్ని అయ్యిపోయింది రేపు ఆగష్టు 13 రిలీజ్ కి కూడా పెట్టాం..

ఈ రోల్ కి ముందే పూర్ణ ని అనుకున్నారా లేక వేరే వారా.?

లేదు ముందు పూర్ణ గారిని అయితే అనుకోలేదు. మా దర్శకుడు ఒక మంచి నటి కోసం అన్ని భాషల్లోని చూసారు. ఆంధ్ర తెలంగాణాలో కూడా చూసాము మంచి నటులు ఉన్నారు కానీ ఈ సినిమాలో ఏంటంటే డైలాగ్స్ తక్కువ ఉంటాయి ఫీల్ ఎక్కువ ఉంటుంది అందుకే వాటిని బాగా పలికించే వారి కోసమే డైరెక్టర్ బాగా వెతికారు. అలా డైరెక్టర్ అనుకున్న ఫీల్ కి పూర్ణ గారు సెట్టయ్యారు అలా ఆమె ఫిక్స్ అయ్యింది.

ప్రేమ, పెళ్లి తర్వాత లైఫ్ పై చాలా సినిమాలే వచ్చాయి మరి ఇదెలా ఉండబోతుంది?

ఇది చిన్న లైన్ నే కానీ ఇప్పటి వరకు ఎవరు టచ్ చెయ్యనిది అంతా ఒకేలా ఉంటుంది కానీ ఒక చిన్న పాయింట్ దగ్గర చాలా తేడా ఉంటుంది అదే ముఖ్యం.. దానిని ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు మేము దానినే చూపించబోతున్నాం.

సినిమాలో చాలానే స్టేజెస్ ఉన్నట్టున్నాయ్ వాటికోసం చెప్పండి?

పూర్ణ పై కొన్ని స్టేజెస్ ఉంటాయి, పెళ్ళికి ముందు ఆ తర్వాత అలా. వాటిలో ప్రతి ఎమోషన్ ని కూడా పూర్ణ తానే ఫీలయ్యి చేసింది దానిని చూసే ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అదే విధంగా బయటకి వస్తారు. వాటికి తగ్గట్టుగా సురేష్ బొబ్బిలి ఇచ్చిన పాటలు కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా వచ్చింది.

ఈ సినిమాని అందరూ చూడొచ్చా?

ఇది ప్రతి ఒక్కరూ చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా చూడదగిన సినిమా ఇది. ఎక్కడా బోల్డ్ నెస్ ఉండదు. టెన్త్ చదివే యంగ్ పిల్లలు కూడా ఈ సినిమా చూడొచ్చు మేము చెప్పే పాయింట్ ఏంటి అన్నది ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.

దర్శకుడు మీకు కథ చెప్పినప్పటికీ ఫైనల్ అవుట్ పుట్ కి మీకేమన్న తేడా అనిపించిందా?

అలా ఏం లేదు నిజంగా డైరెక్టర్ నాకు చెప్పిన దాని కన్నా చాలా బాగా సినిమాని తీసాడు. ముందు కథ విన్నప్పుడు ఆలోచించినా ఫైనల్ గా మాత్రం అనుకున్న దానికన్నా బాగా తీశారు.

ప్రస్తుత సమయంలో చిన్న సినిమా పరిస్థితి ఏమిటి అంటారు?

ప్రెజెంట్ ఎలా ఉంది అంటే సినిమా చూడకుండా ఎవరూ అయితే తీసుకోవట్లేదు. కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ పెట్టినదానికి అంత రాకుండా నొక్కేస్తున్నారు. అది బాలేదు, ఉదాహరణకి ఒక రెండు కోట్లు పెట్టి సినిమా తీస్తే దాన్ని 50 లక్షలకి అడుగుతున్నారు. ఫైనల్ గా నిర్మాతలు పెట్టుకున్న బడ్జెట్ కి తగ్గ ఆఫర్ అయితే చిన్న సినిమాల విషయంలో రావట్లేదు అని నాకు ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ తో ఓపెన్ గా షేర్ చేస్తున్నాను.

మెగా ఫ్యామిలీ లో ఒక హీరోతో సినిమా చేశారు అది మీకు నెక్స్ట్ స్టెప్ అనుకోవచ్చా?

అవును, ఖచ్చితంగా అనుకోవచ్చు నిజానికి ఆయన(కళ్యాణ్ దేవ్) డేట్స్ నే దొరకవు అనుకున్నాను కానీ అయన చాలా కోఆపరేటివ్ గా, సాయం చేసి ఉన్నారు. ఈ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.

నిర్మాతగా మీకు డ్రీం ప్రాజెక్ట్ లాంటివి ఏమన్నా ఉన్నాయా మీ అభిరుచి ఏమిటి?

ప్రొడ్యూసర్ గా డ్రీం ప్రాజెక్ట్ లాంటివి ఏమి లేవు అన్ని ఒకటే అందరు ఒకటే అనుకుంటాను.. నాకు అన్ని సినిమాలు చెయ్యాలి అనుకుంటాను.. నా వరకు అయితే ఎక్కువ కామెడి సినిమాలు ఇష్టపడతాను వాటి తర్వాత హర్రర్. కానీ అవే సినిమాలు నా బ్యానర్ నుంచి చెయ్యాలి అని ఎప్పుడూ అనుకోలేదు.

మరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? పెద్ద హీరోలతో ఏమన్నా ఉన్నాయా?

ప్రెజెంట్ అయితే కళ్యాణ్ దేవ్ తో చేరిన “సూపర్ మచ్చి” కూడా రెడీగా ఉంది. దానిని ఈ నెలలోనే ప్లాన్ చేస్తున్నాం. ఇంకా సప్తగిరితో ఓ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. పెద్ద హీరోలతో అంటే.. బిగ్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి.. కానీ ఆ హీరో పేరు ఇప్పుడు చెప్పను డైరెక్ట్ పోస్టర్ మీదనే చూద్దాం.. ఆ తర్వాత నుంచి నెక్స్ట్ లెవెల్ కి మేము వెళ్ళబోతున్నాం.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు