ఇంటర్వ్యూ : వాణి కపూర్ – ‘ఆహా కళ్యాణం’ ఇక్కడి నేటివిటికి తగినట్టుగా తీశారు

ఇంటర్వ్యూ : వాణి కపూర్ – ‘ఆహా కళ్యాణం’ ఇక్కడి నేటివిటికి తగినట్టుగా తీశారు

Published on Feb 16, 2014 2:31 AM IST

Vaani-Kapoor

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మొదటి సారిగా దక్షిణాన నిర్మించిన సినిమా ‘ఆహా కళ్యాణం’. ఈ సినిమాని ‘బ్యాండ్ బాజా బారత్’ సినిమా రీమేక్ గా నిర్మించారు. ఈ రొమాంటిక్ లవ్ స్టొరీ లో నాని, వాణి కపూర్ లు హీరో హీరోయిన్స్ గా నటించారు. త్వరలో విడుదల కానున్న ఈ ‘ఆహా కళ్యాణం’ సినిమా గురించి హీరోయిన్స్ వాణి కపూర్ ఇంటర్వ్యూ లో తెలియజేశారు. ఆమె ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం.

ప్రశ్న : ఈ సినిమా విడుదల విషయంలో మీరు నర్వస్ గా ఉన్నారా ?

స : నాకు నర్వస్ గా లేదు. కానీ ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారని చాలా ఆతృతగా ఉంది.

ప్రశ్న : ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

స: నేను ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి శృతి గా నటించాను. ఆమె పాసిటివ్ గుణం కలిగి వుంటుంది. ఆమె జీవితంలో ఎలా బ్రతకాలి అనే దానిపై చాలా క్లియర్ గా, ప్లానింగ్ తో ఉంటుంది.

ప్రశ్న : నానితో పనిచేయడం ఎలా అనిపించింది?

స : నేను నానిని మొదటి సారిగా ముంబైలో కలిశాను. అతను నాతో అప్పుడు ఎక్కువగా మాట్లాడలేదు. తను నాతో ఫస్ట్ టైం ఫ్రీగా ఈ సినిమా మొదటి రోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో మాట్లాడాడు. నానితో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలియదు. తను చాలా ఓపెన్ గా, ఫ్రెండ్లీ గా ఉంటాడు. నాని చాలా మంచి వ్యక్తి ఎప్పుడు తను చాలా ఆసక్తికరమైన విషయాలను చెబుతూ ఉంటాడు.

ప్రశ్న : ఈ సినిమాలో నాని ప్రెఫర్మెన్స్ గురించి మీరెమనుకున్నారు ?

స : ఈ సినిమాలో నాని చాలా క్లిష్టమైన పాత్రని చేశాడు. అతను ఈ సినిమాలో అతని పాత్ర చాలా సిన్సియర్ గా, డిఫరెంట్ గా వుంటుంది. దానిని ఆయన చాలా చక్కగా, పరిపూర్ణంగా నటించాడు.

ప్రశ్న : మీ డైరెక్టర్ గోకుల్ కృష్ణ గురించి చెప్పండి ?

స : ఈ సినిమా సెట్ లో నాకు ఇష్టమైన వ్యక్తి ఆయన. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా కూల్ గా ఉంటాడు. అలా ఉంటూనే మా దగ్గర నుండి తనకు కావలసిన పనిని చేయించుకుంటాడు.

ప్రశ్న : ‘బ్యాండ్ బాజా బారత్’ సినిమా ఇంతకుముందు బాలీవుడ్ లో వచ్చింది. ఆ సినిమాని ఇక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు?

స : ‘ఆహా కళ్యాణం’ సినిమా ఆడియన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. సినిమా మంచి హిట్ సాదిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఆ సినిమా స్టొరీని తీసుకోని ఇక్కడి అభిమానుల కోసం ఈ నేటివిటీకి తగినట్టుగా ఈ సినిమాని నిర్మించారు.

ప్రశ్న : ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు వున్నాయి. దీనికి ఇక్కడి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారు ?

స : ఒక ముఖ్యమైన స్టేజిలో ఈ ముద్దు సన్నివేశం వుంటుంది. అది సినిమాని ఒక మలుపు తిప్పుతుంది. ఈ ముద్దు సన్నివేశాన్ని చూసి ఆడియన్స్ షాక్ కు గురికారనే నమ్మకం నాకుంది. అది సినిమా ఫ్లోలో కలిసి పోతుంది.

ప్రశ్న: మీరు సౌత్ సినీ పరిశ్రమకి పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు మీకు ఎవైన ఆఫర్స్ వచ్చాయా ?

స : ఇప్పటి వరకు ఎటువంటి ఆఫర్స్ రాలేదు. దక్షిణాన మంచి పాత్రని ఏ బ్యానర్ ఆఫర్ చేసిన చెయ్యాలని నేను అనుకుంటున్నాను.

ప్రశ్న : మీ రాబోవు సినిమాలు ఏమిటి ?

స : నా తరువాత సినిమా కూడా యష్ రాజ్ బ్యానర్ పైనే నేను వారికి మూడు సినిమాలకు సైన్ చేశాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు