ఓవర్సీస్ కి రీచ్ అయిపోయిన ‘ఆగడు’ ప్రింట్స్

Published on Sep 17, 2014 10:02 pm IST

Aagadu-wallpapers
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు చేస్తున్న ప్రమోషన్స్ వల్ల ఈ సినిమాపై క్రేజ్ పెరిగిపోతోంది మరియు టికెట్స్ కి కూడా డిమాండ్ పెరిగిపోతోంది. ఓవర్సీస్ లో కూడా ఎన్నడూ లేనతంగా ఆగడు ప్రీమియర్స్ కి భారీ డిమాండ్ ఉందని ఇది వరకే తెలియజేశాం..

ఓవర్సీస్ లో ఆగడు ప్రీమియర్ షోస్ చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మేము ఒక శుభవార్తని అందిస్తున్నాం.. యుఎస్ లో 165 స్క్రీన్స్ లో పడుతున్న షౌస్ కోసం డిజిటల్ ప్రింట్స్ ని అప్లోడ్ చేసేసారు. రిలీజ్ కి రెండు రోజుల ముందే అన్ని డిజిటల్ ప్రింట్స్ అప్లోడ్ చేసేయడం వల్ల అనుకున్న టైంకి అన్ని షోస్ పడిపోతాయి. సో ఓవర్సీస్ ఫ్రెండ్స్ గెట్ రెడీ టు వాచ్ ‘ఆగడు’ ప్రీమియర్ షో..

మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే హిట్ అయ్యి ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.

సంబంధిత సమాచారం :