
తమ అభిప్రాయాన్నిసంకోచించకుండా వ్యక్తపరిచే అతికొద్దిమంది ప్రముఖుల్లో దర్శకుడు యెస్.యెస్. రాజమౌళి ఒకరు. తనకి నచ్చిన విషయాలు యాక్టింగ్ పెర్ఫార్మన్స్లను ఎప్పుడు పొగుడుతూ వుంటాడు.
ఇప్పుడు రాజమౌళి పొగడ్తల లిస్ట్లో తాజాగా చేరింది మరెవరో కాదు మన నట సింహం బాలకృష్ణ. రాజమౌళి కి బాలకృష్ణ వోట్లకు డబ్బులు ఇవ్వడానికి పూర్తిగా వ్యతిరేకం అని తెలిసాక తన ట్విట్టర్ ద్వారా హిందూపూర్ కొత్త ఎం.యెల్.యె ని పొగిడారు.
ఒక దగ్గరి వ్యక్తి ద్వారా బాలకృష్ణ గారు హిందూపూర్ లో వోట్లకు డబ్బులు ఇవ్వడానిని పూర్తిగా వ్యతిరేకించారు అని తెలుసుకున్నాను. అది నిజం అయితే #రెస్పెక్ట్!!! అని రాజమౌళి ట్వీట్ చేసారు.
ప్రస్తుతం 2015న విడుదల కానున్న తన భారీ చిత్రం ‘బాహుబలి’ షూటింగ్ లో బిజీగా వున్నారు. ప్రభాస్ రాణాలు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

