ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసిన “నాటు నాటు”

ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసిన “నాటు నాటు”

Published on Nov 11, 2021 8:00 PM IST

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. వీరి సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి. పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ చిత్రం కి సంబంధించిన పాటలు కూడా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్నాయి. తాజాగా నాటు నాటు అనే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది.

రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి వేసిన స్టెప్పులు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట మాస్ బీట్ తో ఉండటం తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అంతేకాక యూ ట్యూబ్ లో సైతం ఈ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ పాట సౌత్ ఇండియా లో టాప్ ప్లేస్ ను చేరుకుంది. ఒక్క రోజులోనే 10.4 మిలియన్ వ్యూస్ ను సాధించడం జరిగింది. ఈ నాటు నాటు ఆల్ టైమ్ రికార్డు సెట్ చేయడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు