105 మినిట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం… హైలెట్స్ ఇవే!

Published on Jul 21, 2021 2:41 pm IST

ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమలో ప్రయోగాలకు కొదవ లేకుండా పోతుంది. అయితే తాజాగా హన్సిక ప్రధాన పాత్రలో రాజు దుస్సా దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం 105 మినిట్స్. అయితే ఈ చిత్రం గురించి నటి హన్సిక మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను అని అన్నారు. చాలా ఎగ్జైటింగ్ గా ఉందని పేర్కొన్నారు. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొనడానికి కారణాలు లేకపోలేదు.

ఇండియన్ స్క్రీన్ పై మొదటిసారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ గా సాగిపోయే స్క్రీన్ ప్లే తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాక సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్, రీల్ టైమ్ మరియు రియల్ టైమ్ ఈ చిత్రానికి హైలెట్స్ అని చెప్పాలి. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ సమీపం లో ఒక విల్లా లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. రుద్రాన్ష్ సెల్యులాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సామ్ సి. ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :